భారీ పెరుగుదల తర్వాత.. బంగారంపై డిస్కౌంట్: 'గోల్డ్.. పూర్‌మెన్ క్రిప్టో'
దీపావళి-ధనతెరాస్ తర్వాత బంగారం ధరలు ఈ వారం డిస్కౌంట్‌కు వచ్చింది. డీలర్లు ఈ వారం అధికారిక దేశీయ ధరల పైన ఔన్స్ బంగారం పైన 2 డాలర్ల వరకు తగ్గింపును ప్రకటించారు. గతవారం ప్రీమియం 1.5 డాలర్ల నుండి తగ్గింది. ధనతెరాస్, దీపావళి పర్వదినం సమయంలో బంగారం కొనుగోలును శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దేశంలో బంగారం ధరలపై 10.75 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
వెండిని సాధారణంగా పేదవారి బంగారంగా పిలుస్తారని, కానీ మున్ముందు క్రిప్టో కరెన్సీ పేదవారి బంగారంగా మారవచ్చునని గోల్డ్‌మన్ శాక్స్ హెడ్ ఆఫ్ ఎనర్జీ రీసెర్చ్ దమియన్ కౌవాలిన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గోల్డ్ పూర్‌మెన్ క్రిప్టోగా మారుతోందన్నారు. కాగా, బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

పసిడి ధరలు ఇప్పుడు రూ.50,000ను సమీపించాయి. మధ్యప్రదేశ్‌లో పసిడి ధర రూ.50,000 దాటింది. ఐదు నెలల తర్వాత బంగారం ధర ఈ మార్కును దాటింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.49,500 వద్ద ఉండగా, శుక్రవారం నాటికి రూ.50,550కి చేరుకుంది. అయితే శనివారం రూ.50,830కి చేరుకుంది. అంతకుముందు పసిడి ధర జూన్ 11వ తేదీన రూ.50,000కు పైన పలికింది. నాటి నుండి రూ.50,000 దిగువనే ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల బంగారం ధర రూ.7000కు వరకు తక్కువగా ఉంది. దీపావళి నుండి రూ.1000కి పైగా పెరిగింది. పసిడి ధరలు ఈ వారం కూడా కాస్త పైపైకి చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.