For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం డిస్కౌంట్స్ 6 నెలల గరిష్టానికి, ఈ వారంలో ఎంత పెరిగిందంటే?

|

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీ వరకు ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెల నుండి చూస్తే ఇప్పుడు హయ్యెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే బంగారం ధరల డిస్కౌంట్ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది.

కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదుకరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు

నిలిచిన ఫిజికల్ ట్రేడింగ్

నిలిచిన ఫిజికల్ ట్రేడింగ్

ఇప్పటికే బంగారం ఫిజికల్ బంగారం ట్రేడింగ్ నిలిచిపోయిందని, మరో రెండు మూడు వారాల పాటు ఎలాంటి వ్యాపారాలు ఉండవని రిద్దిసిద్ధి బులియన్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారి అన్నారు. ఈ వారం గుడిపడ్వా నేపథ్యంలోను ఎలాంటి డిమాండ్ లేదని చెప్పారు. శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43,643 వద్ద క్లోజ్ అయింది. దీనికి 12.5 శాతం ఇంపోర్ట్ ట్యాక్స్, 3 శాతం జీఎస్టీ అదనం.

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

మొన్నటి గురువారం ధరలు పెరిగిన తర్వాత డిస్కౌంట్లు కూడా ఆ స్థాయిలో పెరిగాయని, కానీ వ్యాపారం మాత్రం ఆ స్థాయిలో జరగలేదని ముంబైకి చెందిన గ్లోబల్ ట్రేడింగ్ ఫర్మ్ డీలర్ తెలిపారు. సింగపూర్‌లో ప్రీమియం ఔన్స్‌కు 1.20 డాలర్ నుండి 1.60 వరకు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గత వారం స్పాట్ గోల్డ్ ఔన్స్ 1485 డాలర్ల నుండి 1642 డాలర్ల మధ్య ఉంది.

ఈ వారంలో ఎంత పెరిగిందంటే

ఈ వారంలో ఎంత పెరిగిందంటే

ఈ వారం బంగారం ధర రూ.2,340 పెరిగింది. కిలో వెండి ధర రూ.4,260 పెరిగింది. 99.9 నాణ్యత కలిగిన బంగారం 20వ తేదీన రూ.41,335 ఉండగా, 27వ తేదీ నాటికి రూ.43,675, 99.5 శాతం నాణ్యత కలిగిన బంగారం 20వ తేదీన రూ.41,169, 27న రూ.43,500 ఉంది. 91.6 నాణ్యత కలిగిన బంగారం 20న రూ.37,863, 27న రూ.40,006గా ఉంది. వీటి ధరలు వరుసగా రూ.2,340, రూ.2,331,రూ.2,143 పెరిగింది.

English summary

బంగారం డిస్కౌంట్స్ 6 నెలల గరిష్టానికి, ఈ వారంలో ఎంత పెరిగిందంటే? | Gold Price Futures: discounts jump to 6 month highs amid lockdown

Physical gold dealers struggled to meet surging safe-haven demand this week, especially in Singapore, as the coronavirus outbreak choked global supply chains, while massive discounts were offered in India amidst a lockdown.
Story first published: Sunday, March 29, 2020, 17:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X