For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు, రూ.50,300కు దిగువనే: రూ.750 పెరిగిన వెండి ధర

|

బంగారం, వెండి ధరల నిన్న స్వల్పంగా పెరిగి, 10 గ్రాములు రూ.50,000కు పైన ముగిసింది. శుక్రవారం క్లోజింగ్ సమయానికి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి 268.00 (0.54%) ఎగిసి రూ.50,260.00 వద్ద ముగిసింది. 50,041.00 వద్ద ట్రేడ్ అయిన పసిడి, రూ.50,435.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,857.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న ఓ సమయంలో రూ.50,500 సమీపానికి చేరుకుంది. అయితే రూ.400కు పైగా పెరిగిన ధర చివరకు, రూ.270 పెరుగుదలతో ముగిసింది.

రూ.6000 తగ్గుదల

రూ.6000 తగ్గుదల

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.268 పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.256.00 (0.51%) ఎగిసి రూ.50268.00 వద్ద ముగిసింది. రూ.50,015.00 వద్ద ప్రారంభమై, రూ.50,450.00 గరిష్టాన్ని తాకి, రూ.49,928.00 కనిష్టాన్ని తాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ 7వ తేదీన రూ.56,200తో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఆ ధరతో ప్రస్తుతం రూ.6,000 తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి పసిడి ధరలు భారీగ పెరిగినప్పటికీ, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి.

వెండి రూ.750 జంప్

వెండి రూ.750 జంప్

వెండి ధర రూ.750కి పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.750.00 (1.22%) పెరిగి కిలో రూ.62260.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,610.00 వద్ద ప్రారంభమై, రూ.62,750.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,560.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.733.00 (1.16%) పెరిగి కిలో రూ.64016.00 వద్ద ముగిసింది. రూ.63,450.00 వద్ద ప్రారంభమై, రూ.64,525.00 గరిష్టాన్ని, రూ.63,400.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 8.25(+0.44%) డాలర్లు ఎగిసి 1,869.75 డాలర్ల వద్ద ముగిసింది. 1,859.30 - 1,879.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 1,861.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింద. ఏడాదిలో 25 శాతానికి పైగా పెరిగింది.

వెండి ఫ్యూచర్స్ 0.179 (+0.74%) డాలర్లు ఎగిసి 24.227 డాలర్లు పలికింది. 24.075 - 24.598 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో 24.048 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 40 శాతం వరకు పెరిగింది.

English summary

పెరిగిన బంగారం ధరలు, రూ.50,300కు దిగువనే: రూ.750 పెరిగిన వెండి ధర | Gold Price Forecast: Gold Markets Continue to Find Buyers

Gold markets have rallied to close out the week on Friday, as we continue to find buyers roughly at the $1850 level.
Story first published: Saturday, November 21, 2020, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X