For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ఆల్‌టైం గరిష్టంతో రూ.11,500 డౌన్, రూ.1,000 తగ్గిన వెండి

|

బంగారం ధరలు అంతకంతకూ పడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా క్షీణిస్తున్న పసిడి నేడు (మార్చి 23, మంగళవారం) సాయంత్రం సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో మరో రూ.200 క్షీణించింది. రూ.45,000కు దిగువనే ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ఫ్యూచర్స్ భారీగా తగ్గినప్పటికీ, 1700 డాలర్లకు పైనే ఉంది. వెండి 25 డాలర్ల స్థాయికి వచ్చింది. వెండి ధరలు అయితే భారీగా క్షీణిస్తున్నాయి. నిన్న రూ.1200కు పైగా తగ్గిన సిల్వర్ ఫ్యూచర్స్, నేడు మరో రూ.వెయ్యి తగ్గి, ఈ రెండు రోజుల్లోనే రూ.2వేలకు పైగా తగ్గింది.

మరింత తగ్గిన బంగారం ధర

మరింత తగ్గిన బంగారం ధర

గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.200.00 (-0.45%) క్షీణించి రూ.44705.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,786.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,995.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,662.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.129.00 (-0.29%) క్షీణించి రూ.45081.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,095.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,353.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,050.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మరో వెయ్యి తగ్గిన వెండి

మరో వెయ్యి తగ్గిన వెండి

వెండి ధరలు నిన్న రూ.1200కు పైగా భారీగా క్షీణించాయి. నేడు మరో రూ.1000 తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,075.00 (-1.62%) తగ్గి రూ.65256.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,026.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,324.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,180.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.1,073.00 (-1.59%) తగ్గి రూ.66261.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,151.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,255.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 12.05 (-0.69%) డాలర్లు తగ్గి 1,726.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,724.15 - 1,741.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ధర 0.566 (2.20%) డాలర్లు తగ్గి 25.203 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.192 - 25.915 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం ఆల్‌టైం గరిష్టంతో రూ.11,500 డౌన్, రూ.1,000 తగ్గిన వెండి | Gold price falls to Rs 44,800: silver cheaper by Rs 1000

Gold and silver futures fell on Tuesday, dragged down by gains in equity markets and the dollar, although concerns around fresh Covid-19 cases across Europe limited the losses.
Story first published: Tuesday, March 23, 2021, 21:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X