For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన

|

ముంబై: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు (శుక్రవారం, మార్చి 5) దాదాపు స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.56,200తో దాదాపు రూ.12,000 వరకు తక్కువగా ఉంది. పసిడి ధరలు పది నెలల కనిష్టానికి చేరుకున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఓ సమయంలో హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో పసిడి రూ.59000ను తాకింది. ఇప్పుడు దాదాపు పన్నెండువేల రూపాయలు తక్కువగా ఉంది. నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

రూ.12 వేలు తక్కువ

రూ.12 వేలు తక్కువ

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (శుక్రవారం, మార్చి 5) సాయంత్రం సెషన్లో రూ.44,600 దిగువన పలికింది. ఉదయం కాస్త తగ్గినప్పటికీ, సాయంత్రానికి స్థిరంగా ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8.00 (0.02%) పెరిగి రూ.44,549.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,444.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,649.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,217.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ఓ సమయంలో పసిడి 44,200 స్థాయికి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా దాదాపు స్థిరంగా ఉంది. రూ.9.00 (-0.02%) తగ్గి రూ.44,727 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,600.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,790.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,407.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి తగ్గుదల

వెండి తగ్గుదల

వెండి ధరలు రూ.300 వరకు తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.295.00 (0.45%) తగ్గి రూ.65,626.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,931.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,099.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,014.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. కిలో రూ.307.00 (0.46%) తగ్గి రూ.66,657.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.676,445.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,117.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,148.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 డాలర్ల దిగువకు పసిడి

1700 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు ఉదయం సెషన్లో భారీగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత స్వల్ప తగ్గుదలకు వచ్చాయి. అయినా 1700 డాలర్ల దిగువనే ఉంది. నేడు సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.70 (0.22%) డాలర్లు తగ్గి 1697.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,684.05 - 1,705.60 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువనే ఉంది. ఔన్స్ ధర -0.168 (0.66%) డాలర్లు తగ్గి 25.293 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.965 - 25.490 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన | Gold price falls further to ₹44,344, sets retail buyers on buying spree

Gold prices in India witnessed a further decline on Friday, keeping in line with the downtrend in international markets. On the Multi Commodity Exchange (MCX) gold futures were down 0.44% to ₹44,344 per 10 gram, marking a further fall of ₹250, or 0.56%. Silver futures also fell 0.83% or ₹550 to ₹65,371 per kg.
Story first published: Friday, March 5, 2021, 22:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X