For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది 20% తగ్గిన పసిడి ధరలు, పెరిగినా ఉదయం కంటే డౌన్

|

ముంబై: బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఓ సమయంలో రూ.200కు పైగా పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికి స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ పెరుగుదలతోనే ఉన్నాయి. పసిడి ధరలు ఈ ఏడాది ఇరవై శాతానికి పైగా క్షీణించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ భయాలు కమ్ముకున్నాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఇప్పటికీ రూ.11,500 తక్కువగా ఉంది. వెండి ధర స్వల్పంగా రూ.500 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ.66వేల దిగువన ఉంది.

ఉదయంతో పోలిస్తే స్వల్పంగా జంప్

ఉదయంతో పోలిస్తే స్వల్పంగా జంప్

గోల్డ్ ఫ్యూచర్ నేడు సాయంత్రం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.82.00 (0.18%) పెరిగి రూ.44728.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,879.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,673.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.174.00 (0.39%) పెరిగి రూ.45196.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,100.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,270.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,100.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన వెండి

పెరిగిన వెండి

మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.420.00 (0.65%) పెరిగి రూ.65139.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,139.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,631.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,058.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.446.00 (0.68%) పెరిగి రూ.66490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,257.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,613.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,212.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1732 డాలర్ల పైన....

1732 డాలర్ల పైన....

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ 1750డాలర్ల దిశగా వెళ్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.20 (0.48%) డాలర్లు పెరిగి 1,733.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,722.50 - 1,734.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ధర 0.083 (+0.33%)

డాలర్లు తగ్గి 25.310 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.025 - 25.427 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ఈ ఏడాది 20% తగ్గిన పసిడి ధరలు, పెరిగినా ఉదయం కంటే డౌన్ | Gold price down over 20 per cent, but likely to march towards record high again

Gold prices corrected by over 20 percent from its highs of around Rs 56,500 per 10 grams, but is it a buying opportunity or one should wait? Let us quickly run thru some factors driving prices.
Story first published: Wednesday, March 24, 2021, 22:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X