For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold loan interest rates: వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు

|

అత్యవసరంగా డబ్బులు అవసరమైతే అందరికి గుర్తుకు వచ్చేది ముందుగా గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ రుణం కాబట్టి పర్సనల్ లోన్ కంటే వేగంగా వస్తుంది. గతంలో బ్యాంకులు గోల్డ్ లోన్స్ తక్కువగా ఇచ్చేవి. ఇప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. బంగారం మీద రుణాలు ఇచ్చే పెద్ద బ్యాంకులు, సంస్థలు, చాలా ఉన్నాయి. ఈ రుణాలు బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి ప్రారంభమై 29 శాతం వరకు ఉంది. బంగారం హామీ ఉంటుంది కాబ‌ట్టి త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి కూడా ఈ రుణాలు సుల‌భంగా ల‌భిస్తాయి. వ్య‌క్తిగ‌త రుణాల క‌న్నా ఈ బంగారు రుణాల‌కు వడ్డీ రేటు త‌క్కువ. ఇది అత్యంత ప్రాధాన్య‌ం క‌లిగిన ఫైనాన్సింగ్ సౌక‌ర్యాల్లో ఒక‌టి. ఇవి సెక్యూర్డ్ రుణాలు. ఎమర్జెన్సీ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు ఉపయోగపడుతుంది.

సాధార‌ణంగా బంగారం రుణాల్లో తాక‌ట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ వ్యాల్యూలో డెబ్బై ఐదు శాతం వరకు రుణ సంస్థ‌లు రుణం మంజూరు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కొన్ని బ్యాంకులు 90 శాతం వ్యాల్యూ కట్టి ఇస్తున్నాయి. బంగారు రుణం ఎంత వ‌స్తుంద‌నేది, వ‌డ్డీ వివ‌రాలు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలు, లేట్ ఫీజు గురించి వివిధ బ్యాంకులు, NBFCల వెబ్‌సైట్ల‌లో లోన్ తీసుకోవడానికి ముందు చెక్ చేసుకోవాలి. రీ-పేమెంట్‌లో ఆల‌స్యం కార‌ణంగా అదనపు ఛార్జ్ పడటం లేదా బంగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Gold loan interest rates in various banks

గోల్డ్ లోన్ కోసం చూస్తుంటే కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, NBFCలు ఇచ్చే రుణ వ‌డ్డీ ఆఫర్లు ఇక్క‌డ చూడండి. రెండేళ్ల కాలప‌రిమితికి, రూ.1 ల‌క్ష రుణానికి నెల‌వారీ EMI కింది టేబుల్‌లో ఉన్నాయి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7 శాతం నుండి 29 శాతం వరకు ఉన్నాయి. బ్యాంకుల్లో తక్కువ, ఎన్బీఎఫ్‌సీల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదారణకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి 7.5 శాతం, కెనరా బ్యాంకులో 7.35 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు కాకుండా గోల్డ్ లోన్ పైన నెలకు పడే ఈఎంఐ ఇక్కడ చూడండి.

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,477.

- కెనరా బ్యాంకు వడ్డీ రేటు 7.35 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,493.

- SBI బ్యాంకు వడ్డీ రేటు 7.50 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,500.

- యూనియన్ బ్యాంకు వడ్డీ రేటు 8.20 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,532.

- బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.45 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,543.

- కర్ణాటక బ్యాంకు వడ్డీ రేటు 8.49 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,545.

- ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,546.

- యూకో బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,546.

- ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు 8.50 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,546.

- పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 8.75 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,557.

- జమ్ము అండ్ కాశ్మీర్ బ్యాంకు వడ్డీ రేటు 8.80 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,559.

- సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటు 8.85 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,562.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వడ్డీ రేటు 8.85 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,562.

- HDFC బ్యాంకు వడ్డీ రేటు 8.95 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,566.

- బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 9.00 శాతం, రెండేళ్ల కాలానికి రూ.1 లక్ష రుణానికి నెల ఈఎంఐ రూ.4,568.

ఎన్బీఎఫ్‍‌సీల విషయానికి వస్తే ముథ్తూట్ ఫైనాన్స్ 11 శాతం (EMI రూ.4,661), బజాజ్ ఫిన్ సర్వ్ 11.90 శాతం(EMI రూ.4,703), మణప్పురం ఫైనాన్స్ 12.00 శాతం (EMI రూ.4,707)వడ్డీ రేటును అందిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, బంగారంపై తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తుండటంతో సామాన్యులు చాలామంది బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. గోల్డ్ మీద బ్యాంకుల నుండి తీసుకున్న లోన్లను గమనిస్తే బంగారాన్ని ఏ స్థాయిలో తాకట్టు పెడుతున్నారో తెలుసుకోవచ్చు. బంగారం రుణాలు తీసుకోవడానికి గతంలో బ్యాంకుకు లేదా ఎన్బీఎఫ్‌సీకి 10 మంది వరకు వస్తే ఇప్పుడు అంతకు రెట్టింపు వస్తున్నారట.

English summary

Gold loan interest rates: వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు | Gold loan interest rates in various banks

The interest on gold loans varies, ranging between 7% and 29%. Banks offer loans at lower interest rates than non-banking financial companies (NBFCs).
Story first published: Thursday, August 26, 2021, 22:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X