బంగారం దిద్దుబాటు, ఎనిమిది రెట్లు పెరిగిన దిగుమతులు
సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 658 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది కరోనా నేపథ్యంలో దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ఏడాది ప్రాతిపదికన వృద్ధి నమోదయింది. బంగారం ధరలు దేశీయంగా కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గుతున్నాయి. స్థానిక దిద్దుబాటు ధరల అనంతరం బంగారం ధరలు ప్రస్తుతం ఆరు నెలల కనిష్టం వద్ద ఉన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో నగల వ్యాపారులు కొనుగోళ్లు వేగవంతమవుతాయని నగల వ్యాపారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో భారత్ బంగారం దిగుమతులు 91 టన్నులుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం 12 టన్నులుగా మాత్రమే నమోదయింది.
వ్యాల్యూపరంగా చూస్తే సెప్టెంబర్ నెలలో దిగుమతులు 601 మిలియన్ డాలర్ల నుండి 5.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి 300 డాలర్ల కంటే తక్కువగా ఉంది. గత ఏడాది (2020) ఆగస్ట్ నెలలో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2,072 డాలర్లుగా ఉండగా, ఇప్పుడు 1765 డాలర్లుగా నమోదు అయింది. ఇక, సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ దిగుమతులు 170 శాతం ఎగిసి 288 టన్నులుగా నమోదయ్యాయి.

ఇక బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3.00 (-0.01%) క్షీణించి రూ.46283.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.332.00 (0.71%) తగ్గి రూ.46838.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు లాభపడి 1760 డాలర్లు దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ 7.35 (+0.42%) డాలర్లు లాభపడి 1,765.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ మల్టీ కమోడీటీ ఎక్స్చేంజ్‌లో రూ.389.00 (0.64%) పెరిగి రూ.60939.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.395.00 (0.65%) పెరిగి రూ.61422.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.007 (+0.03%) డాలర్లు లాభపడి 22.543 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.