పండగే పండగ..బంగారం ధర తగ్గింది మామా.. జూన్ 10, మంగళవారం పసిడి ధరలు ఇవిగో..
Gold Rate Today June 9, 2025: దాదాపు నెల రోజుల నుంచి పసిడిప్రియులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. డే బై డే తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితం లక్ష రూపాయలకు పరుగులు పెట్టిన బంగారం ధర ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వస్తోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం 97 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.అయితే ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో పసిడి ధరలు భగ్గుమన్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెబుతున్నారు.
జూన్ 10వ తేదీ మంగళవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,340 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. రూ. 1,09,550గా నమోదైంది. ఇక నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,690 పలకగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,550 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,270 పలికింది. పసిడి ధరలు ప్రస్తుతం రూ. 3 వేలు కన్నా ఎక్కువగానే తగ్గుముఖం పట్టినట్లు మనం చూడవచ్చు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,690 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 73,270 నమోదైంది. నిన్నటి ధరలతో పోల్చుకుంటే గ్రాముకు ఒక రూపాయి చొప్పున రూ. 10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,680 పలుకగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,540 నమోదైంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 గా నమోదైంది.
ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధరలు చూసినట్లయితే 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ.9,035 (రూ.25 తగ్గాయి), 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 72,240 (రూ. 320 తగ్గాయి)గా నమోదయ్యాయి.24 క్యారెట్లు ధరలు ముంబైలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.9,487 (రూ.26 తగ్గాయి), 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 75,896 (రూ.208 తగ్గాయి) వద్ద ఉన్నాయి.చెన్నైలో ఈరోజు 22 క్యారెట్లు బంగారం ధరలు చూస్తే 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ.8,955 (రూ.25 తగ్గాయి), 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 71,640 (రూ.200 తగ్గాయి) వద్ద ఉన్నాయి. అలాగే చెన్నైలో ఈరోజు 24 క్యారెట్లు బంగారం ధరలు చూసినట్లయితే 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.9,403 (రూ.26 తగ్గాయి), 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.75,224 (రూ. 208 తగ్గాయి) వద్ద ఉన్నాయి.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్లు బంగారం ధర 1 గ్రాము రూ. 25 తగ్గి రూ. 9,055 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 8 గ్రాములు రూ. 200 తగ్గి రూ. 72,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 27 తగ్గి 9,508 వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక 8 గ్రాములు రూ.208 తగ్గి 76,064 వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక అహమ్మదాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు చూసుకున్నట్లయితే గ్రాముకు రూ. 25 తగ్గి 9,059 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 200 తగ్గి రూ. 72,472 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరను చూసుకున్నట్లయితే.. 1 గ్రాముకు రూ. 26 తగ్గి 9,512 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 8 గ్రాములు రూ. 208 తగ్గి రూ. 76,096 వద్ద పలుకుతోంది.
బెంగుళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధరలు 1 గ్రాము రూ. 25 తగ్గి 9,070 పలుకుతోంది. 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,560 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల విషయానికి వస్తే.. 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.26 తగ్గింది. 9,524 వద్ద ట్రేడ్ అవుతోంది. 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 208 తగ్గి 76,192 పలుకుతోంది. కలకత్తా విషయానికి వస్తే.. 22 క్యారెట్లు బంగారం ధర ఈ రోజు రూ. 25 తగ్గిన గ్రాము రూ. 9,135 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 73,080 పలుకుతోంది. 24 క్యారెట్లు విషయానికి వస్తే.. 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 26 తగ్గి 9,592 పలుకుతుండగా..8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 208 తగ్గి 76,736 పలుకుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.