నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు (మే 24, గురువారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.189.00 తగ్గి రూ.48,678 వద్ద, వెండి ఫ్యూచర్స్ రూ.750 తగ్గి రూ.71,390 వద్ద ముగిసింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7400 తక్కువగా ఉంది. వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.7,500కు పైగా తక్కువగా ఉంది. డాలర్, బాండ్ యీల్డ్స్ క్రమంగా పుంజుకోవడం పసిడి పైన ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోను ధరలు క్షీణించాయి.

రూ.49వేలకు సమీపంలో...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.14.00 (0.03%) పెరిగి రూ.48798.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,751.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,817.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,751.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.65.00 (0.13%) పెరిగి రూ.49290.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49290.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,221.00 గరిష్టాన్ని, రూ.49,294.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500 దిగువన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు ఉదయం స్వల్పంగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.4.00 (0.01%) పెరిగి రూ.71415.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,337.00 వద్ద ప్రారంభమై, రూ.71,443.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,244.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72.00 (-0.10%) తగ్గి రూ.72519.00 వద్ద ట్రేడ్ అయింది. 72,525.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,558.00 గరిష్టాన్ని, రూ.72,519.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గాయి. 1900 డాలర్ల దిగువకు వచ్చినప్పటికీ అక్కడే కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.40 (0.07%) డాలర్లు తగ్గి 1,899.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,892.10 - 1,897.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.089 (0.32%) డాలర్లు తగ్గి 27.788 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.587 - 27.812 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications