For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

markets: ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు ఇంత సమీకరించాయా ? కానీ గతేడాదితో పోలిస్తే..!!

|

markets: రెండేళ్లుగా భారతీయ కంపెనీల హవా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముందున్నాయి. వివిధ దేశాలు మాంద్యం భయాలతో సతమతమవుతుండగా.. ఏప్రిల్-నవంబర్ మధ్య ఈక్విటీ, డెట్ ల ద్వారా 5.06 లక్షల కోట్లను ఇండియన్ కంపెనీలు సమీకరించాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మాత్రం 8.5 శాతం తగ్గుదల నమోదైనట్లు ఆర్థిక సర్వే 2022-23 మంగళవారం తెలిపింది. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితి, మార్కెట్ పరిణామాలు కొంత ప్రభావం చూపినా.. క్యాపిటల్ మార్కెట్లకు ఈ ఏడాది బాగుందని చెప్పింది.

సింహభాగం IPO లదే..

సింహభాగం IPO లదే..

నవంబరు వరకు సమీకరించిన మొత్తం 5.06 లక్షల కోట్లలో.. 3.92 లక్షల కోట్లు డెట్ మార్కెట్, 1.14 లక్షల కోట్లు ఈక్విటీల ద్వారా వచ్చినట్లు సర్వే డేటా తెలిపింది. 2021 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో చూస్తే.. మొత్తం సమీకరించిన 5.53 లక్షల కోట్లలో 3.71 లక్షల కోట్లు డెట్, 1.81 లక్షల కోట్లు ఈక్విటీల వాటా అని వెల్లడించింది. వీటిలోనూ కేవలం ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌ల (IPO) నుంచే దాదాపు 90 వేల కోట్లు సేకరించినట్లు ప్రకటించింది.

ఇదీ సంగతి..!!

ఇదీ సంగతి..!!

"అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానంపై ఆంక్షలతో పాటు అస్థిర మార్కెట్లు వెరసి పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ మూలధన మార్కెట్ల పనితీరు కొంత మందగించింది" అని ఆర్థిక సర్వే పేర్కొంది.

బ్యాడ్‌ లోనూ గుడ్‌ న్యూస్:

బ్యాడ్‌ లోనూ గుడ్‌ న్యూస్:

ఈక్విటీ విభాగంలో.. ప్రిఫరెన్షియల్ షేర్ల నుంచి ఫండ్స్‌ (దాదాపు 54 వేల కోట్లు) ఎక్కువగా వచ్చాయని సర్వే తెలిపింది. 2021లో ఈ మార్గం ద్వారా వచ్చిన 43 వేల కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. IPO ద్వారా ఈ ఏడాది 104 కంపెనీలు 48 వేల కోట్లను సమీకరించగా.. అంతకు ముందు సంవత్సరం 76 సంస్థలు దాదాపు 89 వేల కోట్లు సాధించినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో మందగమనమున్నప్పటికీ.. IPO ల ద్వారా వస్తున్న SME ల సంఖ్య చాలా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు పేర్కొంది.

రారాజు LIC:

రారాజు LIC:

దేశ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద IPO సైతం ఈ ఏడాదే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మే 2022లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో తన వాటాను స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ చేసింది. తద్వారా ఇది ఇండియాలో అతిపెద్ద IPO గా, ప్రపంచంలో ఆరవ పెద్దదిగా నిలిచింది. ఏప్రిల్-నవంబర్ 2022 వరకు ప్రైమరీ ఈక్విటీ మార్కెట్ల ద్వారా సమీకరించిన మొత్తంలో మూడవ వంతు కంటే ఎక్కువతో LIC లిస్ట్ చేయబడటం విశేషం.

Read more about: equities debt funds stock market
English summary

markets: ఈ ఏడాది ఇండియన్ కంపెనీలు ఇంత సమీకరించాయా ? కానీ గతేడాదితో పోలిస్తే..!! | Funds mobilization by Indian companies in capital markets

Investments mobility 2022
Story first published: Wednesday, February 1, 2023, 9:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X