For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 నెలల్లో రూ.1.21 లక్షల కోట్ల ట్యాక్స్ రీఫండ్స్

|

కరోనా వైరస్ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్‌కు రీఫండ్‌ను వేగంగా చెల్లిస్తోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాకెస్స్(CBDT). 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 36 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్‌కు రూ.1.21 లక్షల కోట్ల రీఫండ్స్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు మొత్తం రూ.1,21,607 కోట్ల నిధులను సీబీడీటీ రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

CBDT రీఫండ చేసిన మొత్తంలో రూ.33,238 కోట్లు వ్య‌క్తిగ‌త ఆదాయంపై చెల్లించిన‌‌ ఇన్‌కమ్ ట్యాక్స రీఫండ్స్ ఉన్నాయ‌ని ఐటీ శాఖ తెలిపింది. మొత్తం 34,09,246 ట్యాక్స్‌పేయ‌ర్స్‌కు ఈ చెల్లింపులు జరిపినట్లు వెల్లడించింది. కార్పొరేట కంపెనీల ఆదాయంపై వ‌చ్చిన కార్పొరేట ట్యాక్స్ రీఫండ్స్ ఎక్కువ‌గా ఉన్నాయని, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు రూ.88,370 కోట్ల కార్పొరేట ట్యాక్స్‌ను 1,83,773 కేసుల‌లో రీఫండ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.

ఇన్ఫోసిస్ చేతికి అమెరికా డేటా అనలిటిక్స్ కంపెనీ, రూ.915 కోట్ల డీల్..ఇన్ఫోసిస్ చేతికి అమెరికా డేటా అనలిటిక్స్ కంపెనీ, రూ.915 కోట్ల డీల్..

Direct tax refunds of over Rs 1.21 lakh crore issued since April

కరోనా నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్‌పేయర్స్‌కు వేగంగా రీఫండ్ చేయడంతో పాటు ఇతర వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ఇటీవల 2019-20 ఆర్థిక అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బుధవారం తెలిపింది.

ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన FY20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలుకు గడువును సీబీడీటీ గతంలో జూన్ 30వ తేదీకి పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. మొదటిసారి జూలై 31కి, రెండోసారి సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది. ఇప్పుడు ఆ గడువును నవంబర్ 30వ తేదీకి పొడిగించింది.

English summary

6 నెలల్లో రూ.1.21 లక్షల కోట్ల ట్యాక్స్ రీఫండ్స్ | Direct tax refunds of over Rs 1.21 lakh crore issued since April

Direct tax refunds of over ₹1.21 lakh crore issued since April. The CBDT has so far issued refunds of over Rs 1.21 lakh crore to nearly 36 lakh taxpayers in the current FY21.
Story first published: Friday, October 9, 2020, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X