For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Deltatech gaming IPO: అడ్డా52 ఆన్‌లైన్ గేమ్ ప్రమోటర్: సెబికి ప్రపోజల్స్

|

ముంబై: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ డెల్టాటెక్.. త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయనుంది. దీనికి అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. దీనిపై సెబి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

సెబి నుంచి అనుమతులు లభించిన వెంటనే డెల్టాటెక్ ఫర్మ్.. తన పబ్లిక్ ఇష్యూను జారీ చేయ్యొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. డెల్టా కార్ప్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ ఫర్మ్ ఇది. అడ్డా52, అడ్డా డాట్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తోంది.

Deltatech gaming filed a DRHP with the SEBI for a Rs 550 crore IPO

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 550 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద 250 కోట్ల రూపాయలు, మిగిలిన మొత్తాన్ని ఫ్రెష్ పబ్లిక్ ఇష్యూలను జారీ చేయడం ద్వారా సేకరించుకోనున్నట్లు సెబికి అందజేసిన తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది.

డెల్టా కార్ప్‌కు అనుబంధంగా కొనసాగుతున్న సంస్థ ఇది. గతంలో గాస్సియన్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన గేమింగ్ కార్యకలాపాలను కొనసాగించింది. కాగా డెల్టా టెక్ తరఫున ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన వెంటనే డెల్టా కార్ప్ షేర్ల ధరలు పెరిగాయి. అయిదు శాతం మేర వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది.

ఈ డెల్టా కార్ప్‌లో స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పెద్ద ఎత్తున స్టేక్స్ ఉన్నాయి. వాటిని ఆయన క్రమంగా విక్రయిస్తోన్నారు. కిందటి నెలలో డెల్టా కార్ప్‌కు చెందిన 25 లక్షల షేర్లను ఆయన స్టాక్ మార్కెట్‌లో సేల్ చేశారు. ఇప్పుడు మళ్లీ మరో ఆరుశాతం మేర కోత పెట్టారు. ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా 3.25 శాతం మేర డెల్టా కార్ప్ షేర్లను అమ్మి వేశారు.

English summary

Deltatech gaming IPO: అడ్డా52 ఆన్‌లైన్ గేమ్ ప్రమోటర్: సెబికి ప్రపోజల్స్ | Deltatech gaming filed a DRHP with the SEBI for a Rs 550 crore IPO

Deltatech Gaming, a wholly owned real money gaming subsidiary of casino operator Delta Corp, filed a draft prospectus with the SEBI for a Rs 550 crore IPO.
Story first published: Friday, June 17, 2022, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X