భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉఫసంహరణకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, వైజాగ్ స్టీల్‌తో పాటు పలు పీఎస్‌యూల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని ప్రైవేటీరణకు సిద్ధమవుతున్న కేంద్రం.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తాజాగా వెల్లడించింది. ఆర్ధికమంత్రిత్వశాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ దీనిపై మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంటామని తెలిపారు.

చురుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ
దేశంలో వరుస నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ సంస్ధలను సాధ్యమైనంత త్వరగా వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నీతి ఆయోగ్‌తో పాటు పలు ఆర్ధిక సంస్ధలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పెట్టుబడుల ఉపసంహరణకు వేగంగా పావులు కదుపుతోంది. ఆయా సంస్ధల్లో వేగంగా పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. అంతే కాదు దాన్ని అధిగమిస్తామని ధీమాగా చెప్తోంది.

రూ.1.75 లక్షల కోట్ల ఉపసంహరణ
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్లో ప్రైవేటీకరణను వేగంగా అమలు చేయడం ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత పరిస్దితుల్లో కేంద్రానికి ఇదంత కష్టమేమీ కాబోదన్న వాదన వినిపిస్తోంది. ఏడాది కాలంలో ఈ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంటామని ఆర్ధికమంత్రిత్వశాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్తున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ ఇలా
దేశంలో పెట్టుబడుల ఉపసంహరణకు వేగంగా పావులు కదుపుతున్న కేంద్రం..ఇప్పుడు ఏకంగా ఎక్కడెక్కడ ఉపసంహరిస్తారో కూడా బహిర్గతం చేస్తోంది. ఒక్క బీపీసీఎల్ ప్రైవేటీకరణ ద్వారా రూ.75 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే ఎల్‌ఐసీని స్టాక్ మార్కెట్లు లిస్టింగ్ చేయడం ద్వారా లక్ష కోట్ల రూపాయలు అర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పూర్తవుతుందని ఆర్ధికమంత్రిత్వశాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు.

మళ్లీ 7-7.5 శాతం వృద్ధి రేటు
కరోనా తర్వాత మారిన పరిస్ధితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంతిమంగా తిరిగి 7 నుంచి 7.5 శాతం వృద్ధిరేటు త్వరలోనే అందుకుంటామన్నధమాను ఆర్ధికమంత్రిత్వశాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ వ్యక్తం చేశారు. 2022-23 నాటికి వృద్ధి రేటు 6.5 నుంచి 7.5 శాతానికి చేరుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు. "మొత్తం ద్రవ్యోల్బణ లక్ష్యం ద్రవ్యోల్బణం యొక్క అస్థిరతను మరియు ద్రవ్యోల్బణ స్థాయిని తగ్గించడంలో సహాయపడింది.

భారత్‌లో మరిన్ని బ్యాంకులు
భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్ధపై ప్రజల్లో, ఖాతాదారుల్లో నమ్మకం సడలుతున్న నేపథ్యంలో ఆర్ధికమంత్రిత్వశాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ బ్యాంకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశ జనాభాలో మూడోవంతు కలిగిన అమెరికాలో 25 వేల నుంచి 30 వేల బ్యాంకులు ఉన్న అంశాన్ని సుబ్రమణియన్ గుర్తు చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఊతమిచ్చేందుకు మరిన్ని బ్యాంకులు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications