ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో చైనా వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనా లెక్కలు, మాటలపై అనుమానాలు ఉండటం ఉంటాయి. ఎన్నో దేశాలు డ్రాగన్ లెక్కలను విశ్వసించవు. అయితే కరోనా ప్రభావం నుండి చైనా ఇతర దేశాల కంటే వేగంగా కోలుకుంటున్నట్లుగా ఆ దేశ ఆర్థిక లెక్కలు చెబుతున్నాయి.
ఆగస్ట్ నెలలో చైనా ఎగుమతులు భారీగా పెరగగా, దిగుమతులు తగ్గుముఖం పట్టినట్లు ఆ దేశ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈసారి చైనా ఎగుమతులు 9.5 శాతం మేర పెరిగాయి. దిగుమతులు 2.1 శాతం క్షీణించాయి. చైనా నుండి దిగుమతులు తగ్గించుకుంటామని వివిధ దేశాలు చెబుతుండగా, అందుకు భిన్నంగా ఆగస్ట్‌లో చైనా నుండి పెరగడం గమనార్హం.

వాణిజ్య పునరుద్ధరణ
కరోనా మహమ్మారి నుండి ప్రపంచ దేశాలు క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే చైనా వేగంగా పుంజుకుటోంది. ఇతర చాలా దేశాల్లో కరోనా భయాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో చైనా నుండి ఎగుమతులు మరింతగా పెరగవచ్చు. ఎగుమతులు పెరుగుతాయని ఆ దేశ నిపుణులు మొదటినుండి అంచనా వేస్తున్నారు. దాదాపు 7.1శాతం ఉంటుందని భావించారు. అయితే అంచనాలకు మించి దాదాపు పది శాతం వృద్ధిని నమోదు చేసింది.

వాణిజ్య మిగులు
ఎగుమతులు భారీగా పెరిగి, దిగుమతులు కొంత తగ్గడంతో చైనాలో మొత్తంగా వాణిజ్య మిగులు పెరిగింది. ప్రపంచ అగ్ర ఆర్థికవ్యవస్థ అమెరికాతో పోలిస్తే ఆగస్ట్ నెలలో చైనా వాణిజ్య మిగులు 27 శాతం పెరిగినట్లు స్థానిక పత్రిక కథనాల ద్వారా వెల్లడవుతున్నాయి. 2019 ఏప్రిల్ మాసం నుండి ఈ 17 నెలల కాలంలో చైనా ఎగుమతులు ఈస్థాయిలో వృద్ధి చెందడం ఇది మొదటిసారి. అప్పుడు ఎగుమతులు ఏకంగా 14.2 శాతం పెరిగాయి. ఆ తర్వాత గరిష్ట పెరుగుదల ఇదే. అదే సమయంలో దిగుమతులు వరుసగా రెండో నెల తగ్గుముఖం పట్టాయి. చైనా దిగుమతుల వృద్ధి ఈ ఏడాది జూన్ నెలలో మాత్రమే పెరుగుదలను నమోదు చేసింది.

ట్రేడ్ బ్యాలెన్స్
చైనా ట్రేడ్ బ్యాలెన్స్ జూలై నెలలో 62.33 బిలియన్ డాలర్లు కాగా, ఆగస్ట్ నెలలో 58.93 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది ఎగుమతుల పెరుగుదల, దిగుమతుల తగ్గుదలను వెల్లడిస్తోందని చెబుతున్నారు. కరోనా వైరస్ షట్ డౌన్ నుండి చైనా వేగంగా పుంజుకుంది. ఎగుమతులు, పెట్టుబడులను వేగవంతం చేసింది. ఆగస్ట్ నెలలో అమెరికాకు ఎగుమతులు 20 శాతం పెరిగి 44.8 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అమెరికా నుండి దిగుమతులు 1.8 శాతం పెరిగి 10.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆగస్ట్ నెలలో అమెరికాతో చైనా 34.2 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుతో ఉంది. జూలై మాసంలో ఇధి 32.46 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications