For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నాలుగింటిలో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయో రిటర్న్స్, డబుల్ కంటే ఎక్కువ

|

కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపింది. వ్యక్తి ఆర్థిక జీవనంపై పెను ప్రభావం చూపడంతో, ఇప్పుడు సంపాదనలో ఖర్చు, పెట్టుబడులకు సంబంధించి చాలా స్పష్టంగా ఉంటున్నారు. కరోనా తర్వాత ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశించడం, తమ మూలధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. వాస్తవానికి రిస్క్ అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి ఇస్తే కనుక అధిక రాబడులను అందిస్తుంది. పెట్టుబడి సమయంలో ప్రజలు పన్నులను ఆదా చేయాలని భావిస్తారు. ఇలాంటి సమయంలో మోడిఫైడ్ వర్షన్ మ్యూచువల్ ఫండ్స్ - ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) ఫండ్స్ వైపు చూడవచ్చు.

పన్ను మినహాయింపు

పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఇండివిడ్యువల్ ఎవరైనా ELSSలో రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ELSS ఫండ్స్‌తో అనుసంబంధించబడిన లాక్-ఇన్ పీరియడ్ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది. ఇలా వారు అధిక రాబడిని కూడా పొందే అవకాశాలను పరిగణించవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజింగ్ సంస్థ వ్యాల్యూ రీసెర్చ్ అందుబాటులోని ఉత్తమ ఎంపికలను గుర్తించేందుకు ఈఎల్ఎస్ఎస్ నిధుల శ్రేణిని విశ్లేషించింది. వ్యాల్యూ రీసెర్చ్ రేట్ చేసిన మొదటి ఐదు స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి.

BOI AXA ట్యాక్స్ అడ్వాంటేజ్

BOI AXA ట్యాక్స్ అడ్వాంటేజ్

రూ.1 లక్ష పెట్టుబడి పైన 31 శాతం వరకు రాబడులు అందించింది. BOI AXA ట్యాక్స్ అడ్వాంటేజ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ వ్యవధిలో రూ.2,27,969 రాబడిని అందించినందుకు గాను ఫైవ్ స్టార్‌ను పొందింది. BOI AXA అడ్వాంటేజ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ సిప్ రిటర్న్స్ 41.1 శాతంగా ఉన్నట్లు వ్యాల్యూ రీసెర్చ్ తెలిపింది. అంట్ మీరు నెలకు రూ.10,000 సిప్ పెట్టుబడి చేస్తే మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ కాలంలో రూ.6,28,455 వస్తాయి.

కెనరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్

కెనరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్

కెనరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ కూడా వ్యాల్యూ రీసెర్చ్ నుండి 5 స్టార్ రేటింగ్‌ను పొందినది. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ రూ.1 లక్ష పెట్టుబడి ద్వారా 26.68 శాతం వరకు రిటర్న్స్ ఇస్తుంది. సిప్ పెట్టుబడి ద్వారా నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫండ్ 36.34 శాతం రాబడిని అందిస్తుంది. అప్పుడు లమ్‌సమ్ పెట్టుబడి రూ.2,03,308 అయితే, సిప్ మొత్తం రూ.5,92,242కు పెరుగుతుంది.

మిరా అసెట్ ట్యాక్స్ సేవర్

మిరా అసెట్ ట్యాక్స్ సేవర్

మరో ఫైవ్ స్టార్ రేటింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మిరా అసెట్ ట్యాక్స్ సేవర్. ఇది లమ్‌సమ్ మొత్తం పైన 27.19 శాతం రిటర్న్స్ ఇస్తోంది. సిప్ పెట్టుబడి ద్వారా నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే 36.19 శాతం రిటర్న్స్ వస్తాయి. మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ద్వారా రూ.5,95,006 వస్తుంది.

క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ - డైరెక్ట్

క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ - డైరెక్ట్

క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ - డైరెక్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పైన మంచి రిటర్న్స్ అందించింది. ఇది లమ్‌సమ్ మొత్తం పైన 38 శాతం వడ్డీ రేటు ఇచ్చింది. సిప్ పెట్టుబడి పైన 56.97 శాతం రిటర్న్స్ ఇచ్చింది. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.2,63,400, సిప్ ద్వారా నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.7,59,900 రావొచ్చు.

English summary

ఈ నాలుగింటిలో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయో రిటర్న్స్, డబుల్ కంటే ఎక్కువ | Check 4 top rated ELSS fund to save Income Tax and a Hefty return on investment

After the blows incurred by the economy due to the pandemic, people are now more cautious and prudent when it comes to entering into the equity market and investing their capital.
Story first published: Sunday, February 20, 2022, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X