For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిసారి టాస్క్‌ఫోర్స్, భారత్‌కు 40 దిగ్గజ కంపెనీల సహకారం: సీఈవోల కీలక నిర్ణయం

|

కరోనా విలయంతో భారత్ తల్లడిల్లుతోంది. మన దేశానికి అండగా నిలిచేందుకు యావత్ ప్రపంచం ముందుకు వస్తోంది. ఇప్పటికే పలు దేశాలు సాయం ప్రకటించాయి. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు భారత్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. అమెరికాలో ప్రముఖ కంపెనీలు ఎన్నో ఏకతాటి పైకి వచ్చాయి. దాదాపు 40 కంపెనీలు టాస్క్ ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నాయి.

20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

దీనిని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ది యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ అండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి వాణిజ్య సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో భారత్‌కు సహకరించాలని నిర్ణయించాయి. వచ్చే కొద్ది వారాల్లో 20వేల వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు అందించాలని నిర్ణయించినట్లు డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ తెలిపారు.

త్వరలో సేవింగ్ పరికరాలు

త్వరలో సేవింగ్ పరికరాలు

ఈ కొత్త అమెరికా పబ్లిక్-ప్రయివేట్ ఫార్ట్‌నర్‌షిప్ త్వరలో భారత్‌కు కీలకమైన మెడికల్ వస్తువుల సరఫరా, వ్యాక్సీన్, ఆక్సిజన్, ఇతర లైఫ్ సేవింగ్ పరికరాలను అందించనుంది. ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని రూపుమాపేందుకు అంతర్జాతీయస్థాయిలో కార్పోరేట్ వర్గాలు టాస్క్ ఫోర్స్‌గా ఏర్పడటం ఇదే మొదటిసారి. సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైన మార్గంలో భారత్‌కు సహకరించేందుకు అమెరికాలు సిద్ధమని చెబుతున్నారు.

25వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

25వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ఈవారం మధ్యలో భారత్‌కు వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చేరనున్నట్లు చెబుతున్నారు. మే 5వ తేదీ నాటికి ఆ సంఖ్య 11,000కు చేరుకోవచ్చునని అంటున్నారు. మొత్తం 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైతే అంతకుమించి పంపించనున్నారు. తర్వాత దశలో 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మానిటరింగ్ కిట్స్ పంపించనున్నారు. తాజాగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌లో ఈ-కామర్స్, రిటైల్, ఫార్మా, టెక్, తయారీ రంగాల పరిశ్రమలు భాగస్వామ్యం అయ్యాయి.

English summary

తొలిసారి టాస్క్‌ఫోర్స్, భారత్‌కు 40 దిగ్గజ కంపెనీల సహకారం: సీఈవోల కీలక నిర్ణయం | CEOs of 40 top American companies create global task force to help India fight COVID 19

In a show of solidarity, the CEOs of about 40 top American companies have come together to create a first-of-its-kind country-specific global task force to mobilise resources and coordinate efforts to help India fight the battle against COVID-19.
Story first published: Tuesday, April 27, 2021, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X