For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్‌దేఖోలో భారీగా ఉద్యోగాల కోత, 22% వరకు వేతనాల్లో కోత

|

ఆన్‌లైన్ ఆటో క్లాసిఫైడ్ పోర్టల్ కార్‌దేకో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల తొలగింపుతోపాటు బోర్డు సభ్యులందరికీ వేతనాల్లో కోత విధించాలని కూడా నిర్ణయించింది. కార్‌దేకో హెడ్ క్వార్టర్ జైపూర్‌లో ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో వివిధ కంపెనీలు, సంస్థలు ఉద్యోగాల కోత లేదా శాలరీ కోతకు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.

టాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం, వారి వేతనాల్లో 20% కోతటాటా గ్రూప్ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం, వారి వేతనాల్లో 20% కోత

5000 మందిలో 200 మంది కోత

5000 మందిలో 200 మంది కోత

ప్రస్తుత పరిస్థితుల్లో వేతన కోత, ఉద్యోగాల కోత ఉందని కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కార్‌దేకోలో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో దాదాపు 200 మందిని తొలగించనున్నారట. పరిస్థితులు మరీ ఘోరంగా ఉంటే ఈ సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

వేతన కోత

వేతన కోత

ఈ సంస్థలో రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారికి 12 శాతం కోత విధిస్తున్నారు. రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారికి 15 శాతం కోత ఉంటుంది. ఇవి మే నుండి జూలై వరకు వర్తిస్తుంది. 15 లక్షల నుండి రూ.40 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారికి 20 శాతం కోత, రూ.40 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 22.5 శాతం కోత ఉంటుంది.

వరుసగా ఉద్యోగుల తొలగింత

వరుసగా ఉద్యోగుల తొలగింత

ఆన్‌లైన్ మార్కెట్ స్నాప్‌డీల్ 750 మంది ఉద్యోగులను 3 నెలల పాటు వేతనం లేని సెలవులపై పంపించింది. అలాగే 800 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన ఒప్పందాలను పునరుద్ధరించలేదు. రైడ్ హెయిలింగ్ సంస్థలు ఓలా, హాస్పిటాలిటీ చైన్ ఓయో, ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

English summary

కార్‌దేఖోలో భారీగా ఉద్యోగాల కోత, 22% వరకు వేతనాల్లో కోత | CarDekho lays off staff, cuts salary amid COVID 19 crisis

Online auto classifieds portal CarDekho has laid off around 200 employees, and initiated pay cuts across the board, making the Jaipur-headquartered company the latest in a series of well-funded startups that have retrenched staff in the wake of the Covid-19 pandemic.
Story first published: Tuesday, May 26, 2020, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X