For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022: బంగారానికి సంబంధించి కేంద్రం కీలక అడుగు!

|

బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపరచడంలోను అనేక వ్యయాలను భరించవలసి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏ బ్యాంకులో అయినా ఈ గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించవచ్చునని తెలుస్తోంది. అకౌంట్ ప్రారంభించిన తర్వాత ఎప్పుడైనా ఒక గ్రాము బంగారానికి సమాన మొత్తాన్ని కనీసంగా డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పూచీకత్తు కలిగిన సావరీన్ గోల్డ్ బాండ్స్‌ను ఈ అకౌంట్‌లో కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించనున్నారు. ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు బంగారం వ్యాల్యూ ఆధారంగా నగదు ఇస్తారు. అన్ని అకౌంట్స్ మాదిరిగానే దీనికి పాస్ బుక్ ఉండనుంది. డిపాజిట్స్, ఉపసంహరణను నోట్ చేసుకోవచ్చు.

గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ అంటే?

గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ అంటే?

సావరీన్ గోల్డ్ బాండ్స్ వంటిదే గోల్డ్ సేవింగ్స్ అకౌంట్. కానీ గోల్డ్ బాండ్స్‌లో ఇనవెస్ట్ చేయాలంటే కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సేవింగ్స్ అయితే నిత్యం అందుబాటులో ఉంటుంది. గ్రాము పసిడికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులో గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్‌‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గ్రాము నుండి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. నగదును ఉపసంహరించుకునే సమయంలో ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లిస్తాయి. బ్యాంకు పాస్ బుక్ కూడా జారీ చేస్తుంది. ఈ ఖాతాలోని డిపాజిట్స్ పైన గోల్డ్ బాండ్స్ తరహాలో 2.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తాయి.

పెట్టుబడిగా బంగారం

పెట్టుబడిగా బంగారం

బంగారం చాలా విలువైనది. దీనిని కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాలి. అలాగే దానిని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటారు. అయితే దానిని భద్రపరుచుకోవడం కోసం బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు. ఆభరణ రూపంగా కాకుండా పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవాలనుకునే వారికి గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ ఉపయోగపడుతుంది. మూలధనంపై వచ్చే లాభంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

ధరను ఎలా నిర్ణయిస్తారు

ధరను ఎలా నిర్ణయిస్తారు

సావరీన్ గోల్డ్ బాండ్స్ అయితే ఆర్బీఐ గ్రాముకు ఇంత ధర అని నిర్ణయిస్తుంది. బాండ్స్ జారీ చేసే సమయం ఆధారంగా ధరను నిర్ణయిస్తుంది. బాండ్స్ సబ్‌స్క్రిప్షన్ సమయంలో బంగారం ధరలో మార్పు వచ్చినా అదే ధరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ విషయంలో అలా కాదు. ఏ రోజుకు ఆ రోజుకు ధరను నిర్ణయించవలసి ఉంటుంది. అలాగే, నగరానికి నగరానికి మధ్య ధరలో వ్యత్యాసం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.

English summary

Budget 2022: బంగారానికి సంబంధించి కేంద్రం కీలక అడుగు! | Budget 2022: Government may announce Gold Savings Account

Government can announce Gold Savings Account in the coming budget. It has been said in the report that the government also wants to keep the rising current account deficit under control through this.
Story first published: Tuesday, January 25, 2022, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X