ఫెడ్ వడ్డీ రేటు ఎఫెక్ట్, భారీగా పతనమైన క్రిప్టో: 43,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ భారీగా పతనమైంది. రెండు రోజులుగా అది క్షీణిస్తోంది. వరల్డ్ మోస్ట్ వ్యాల్యూడ్ క్రిప్టో బిట్ కాయిన్ ఉదయం 44,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. సాయంత్రానికి మరింత క్షీణించి 42,780 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ ఫ్లాష్ క్రాష్ తర్వాత ఇది భారీ పతనం. వరల్డ్ మోస్ట్ పాపులర్ అండ్ లార్జెస్ట్ డిజిటల్ టోకెన్ మార్కెట్ క్యాప్ రెండు రోజుల్లో దాదాపు 9 శాతం క్షీణించింది. నవంబర్ నెలలో ఇది ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లను తాకింది. ఈ గరిష్టస్థాయితో ప్రస్తుతం 26,000 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.
వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 43,000 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్ సెల్లింగ్ వ్యాల్యూమ్ పెరిగింది. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బిట్ కాయిన్ తదుపరి మద్దతు ధర 40,000 డాలర్లుగా చెబుతున్నారు వాజిర్ఎక్స్ సీవోవో సిద్ధార్థ్ మీనన్.

రెండో అతిపెద్ద క్రిప్టో ఎతేరియం 3500 డాలర్ల దిగువకు పడిపోయింది. డోజీకాయిన్ 6 శాతం క్షీణించి 0.15 డాలర్లు, షిబా ఇను 7 శాతం తగ్గి 0.000030 డాలర్లకు పడిపోయింది. బియాన్స్ కాయిన్ 7 శాతానికి పైగా తగ్గి 476 డాలర్లుగా ఉంది. సోలానా, పాలిగోన్, యూనిస్వాప్, స్టెల్లార్, కార్డానో, ఎక్స్‌పీఆర్, టెథేర్, లైట్ కాయిన్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇవి ఐధు శాతం నుండి పది శాతం మేర తగ్గాయి.