బ్యాంకులు, ఐటీ స్టాక్స్ దెబ్బ, భారీ నష్టాల్లో మార్కెట్లు: రిలయన్స్, హెచ్‌సీఎల్, టీసీఎస్ పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 550 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 14,500 దిగువకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ వంటి స్టాక్స్ దెబ్బతీశాయి. సూచీలు గత కొంతకాలంగా సరికొత్త శిఖరాలకు చేరుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్ పరిస్థితులను గమనించి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 49,000 మార్కు దిగువకు పడిపోయింది.
షియోమీ, నూక్‌లపై కఠిన నిర్ణయం: గద్దె దిగే ముందు చైనాకు ట్రంప్ వరుస షాకులు

సెన్సెక్స్ భారీ పతనం.. స్వల్పంగా కోలుకొని
సెన్సెక్స్ 549.49 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 49,034.67 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161.90 పాయింట్లు లేదా 1.11% క్షీణించి 14,433.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1070 షేర్లు లాభాల్లో, 1897 షేర్లు నష్టాల్లో ముగియగా, 139 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
నేడు సెన్సెక్స్ 49,656.71 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నేటి గరిష్టం కూడా ఇదే కావడం గమనార్హం. ఓ సమయంలో 850 పాయింట్ల వరకు పతనమై 48,796 పాయింట్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 49,000కు పైన క్లోజ్ అయింది.
డాలర్ మారకంతో భారత రూపాయి స్వల్పంగా క్షీణించి 73.12 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.08 వద్ద ప్రారంభమైంది. గురువారం 73.04 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.99-73.17 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 6.20 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.81 శాతం, UPL 2.58 శాతం, ITC 1.73 శాతం, గ్రాసీమ్ 1.25 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 4.30 శాతం, గెయిల్ 3.82 శాతం, HCL టెక్ 3.69 శాతం, విప్రో 3.48 శాతం, ఓఎన్జీసీ 3.47 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు పతనమై 1937 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ 0.64 శాతం నష్టపోయి రూ.3290 వద్ద, ఇన్ఫోసిస్ దాదాపు 2 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.77 శాతం, టెక్ మహీంద్రా 3.95 శాతం పతనమైంది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.11 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.98 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.84 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.86 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.00 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 2.24 శాతం, నిఫ్టీ మీడియా 1.27 శాతం, నిఫ్టీ మెటల్ 1.10 శాతం, నిఫ్టీ ఫార్మా 1.65 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.06 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.82 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.79 శాతం నష్టపోయాయి.