కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు 90 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ఐటీ కంపెనీలకు మరో రెండు మూడు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్పాదన పట్ల కంపెనీలు సంతృప్తికరంగానే ఉన్నాయి. పైగా ఖర్చులు తగ్గుతున్నాయి. కాబట్టి లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కంపెనీలు ఎక్కువగా దీనికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్
లాక్ డౌన్ ముగిసిన తర్వాత విడతలవారీగా రానున్న ఐదేళ్లలో కార్యాలయాలకు 25 శాతం ఉద్యోగులను పరిమితం చేసి, 75 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని టీసీఎస్ భావిస్తోంది. ఇదే దారిలో మిగతా టెక్ దిగ్గజాలు కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా కార్యాలయ ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి కాబట్టి వాటి నుండి తప్పించుకునేందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇవ్వవచ్చు.

లాక్ డౌన్ ఎత్తివేశాక ఐటీ కంపెనీలకు కొత్త సవాల్
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం లేని కంపెనీలకు, అలాగే లాక్ డౌన్ ఎత్తివేశాక ప్రారంభంలోనే పూర్తిగా ఇవ్వలేరు కాబట్టి ఉద్యోగులంతా కార్యాలయానికి వచ్చే అవకాశముంటుంది. లాక్ డౌన్ ఎత్తివేసినా సామాజిక దూరం వంటివి పాటించవలసి ఉంటుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్కూల్స్, కాలేజీలు, కంపెనీలతో పాటు ఐటీ సహా వివిధ రంగాలకు ఇవి సవాల్‌తో కూడుకున్నవే. కేఫ్ టేరియా వద్ద, దుకాణాల వద్ద, డైనింగ్ హాల్‌లో, సమావేశపు గదులు, కార్యాలయంలో తమ ఉద్యోగులు గుమికూడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది.

ఆ అవసరాలు తీర్చాల్సిందే
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్ ఎత్తివేశాక విద్యా రంగం సహా ఏ రంగమైనా సామాజిక దూరం పాటించడం క్లిష్టమైన అంశమేనని చెబుతున్నారు. విద్యార్థులకు క్లాస్ రూంలలో, ఐటీ ఉద్యోగులకు కార్యాలయాల్లో సామాజిక దూరం పాటించే అవసరాలను తీర్చాల్సి ఉంటుందని, ఇది సరికొత్త తలనొప్పి అని చెబుతున్నారు.

కంపెనీలు రెడీ
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నాయట. అలాంటి సూచనలు చేయడం, సౌకర్యాలు కల్పించడంతో పాటు అత్యవసరం కానీ ఉద్యోగులకు మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అప్పుడు ఉన్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించడం కొంతలో కొంత ఈజీ అని భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేశాక తమ ఉద్యోగుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ నిపుణులు కూడా సామాజిక దూరం పాటించేలా చేయడంతో పాటు వెసులుబాటు ఉండే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications