For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరం

|

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. మార్కెట్ కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వంటి అతి విలువైన లోహాలపై ఇన్వెస్ట్ చేశారు. సౌదీ అరేబియా - రష్యా మధ్య ముడి చమురు యుద్ధం కారణంగా ఆ పెట్టుబడులు కూడా కొంత సమయం బంగారం వైపు మరలాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు పెట్టుబడి వైపు కాకుండా దాచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

రూ.603 కోట్లు నష్టపోయిన బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ 'బేర్'రూ.603 కోట్లు నష్టపోయిన బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ 'బేర్'

ఈ బంగారం మాకొద్దు బాబూ...

ఈ బంగారం మాకొద్దు బాబూ...

కరోనా వైరస్ దెబ్బ చివరకు పెట్టుబడులకు స్వర్గధామంగా ఇప్పటి వరకు భావించిన బంగారం పైన కూడా పడింది. మార్కెట్‌లో చాలా రోజులుగా అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి. చమురు ధరలు కుప్పకూలడంతో అందులో ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదు. ఇప్పుడు బంగారంపై పెట్టుబడులను కొంతమంది ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటున్నారు.

నగదు రూపంలోనే.

నగదు రూపంలోనే.

కరోనా భయంతో అన్ని పెట్టుబడి సాధనాల నుంచి డబ్బుని వెనక్కు తీసుకుని, నగదు రూపంలోనే భద్రపరుచుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక తిరోగమనం, మార్కెట్ నష్టాల కారణంగా పసిడికి డిమాండ్ భారీగా పెరగాలి. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బంగారంలో హెచ్చుతగ్గులు

బంగారంలో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం పతనమవుతోంది. గురువారం బంగారం ధర పతనమై 1,577కు చేరుకుంది. అయితే శుక్రవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోలు కంటే నగదు రూపంలో దాచుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

బంగారం నుండి దూరమెందుకు..

బంగారం నుండి దూరమెందుకు..

ఇన్వెస్టర్లు బంగారం నుండి దూరం జరగడానికి కూడా కారణముందని అంటున్నారు. బంగారం ఏడాది కాలంలోనే దాదాపు రూ.11 వేలు పెరిగింది. మందగమనం, కరోనా, వాణిజ్య యుద్ధం వంటి వివిధ కారణాలతో బంగారం ధర పెరుగుకుంటూ పోతోంది. అయితే అంతా సద్దుమణిగిన తర్వాత ధరలు ఎలా ఉంటాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో ఉంది. ఇప్పటికే పసిడి రికార్డ్ ధరకు చేరుకుంది. ముందు ముందు పెరిగినా అది నిలకడగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

క్రూడాయిల్ కష్టాలు

క్రూడాయిల్ కష్టాలు

మరోవైపు ప్రైస్ వార్ కారణంగా క్రూడాయిల్ ధరలు పడిపోతున్నాయి. దీంతో ఆయిల్ సంబంధిత కంపెనీలు, షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లైట్ స్వీట్ నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కూడా 35 డాలర్ల కీలక స్థాయిని అధిగమించలేక గురువారం ఒక దశలో 30కి పడిపోయింది. మరోవైపు ఆరు దేశాల కరెన్సీతో ట్రేడ్ అయ్యే డాలర్ ఇండెక్స్ 98 వద్ద ట్రేడ్ అయింది. క్రూడాయిల్‌లో ఇన్వెస్ట్ చేసిన కుబేరుల సంపద ఆవిరవుతోంది.

English summary

కరోనా షాక్: అమ్మో! ఈ బంగారం మాకు వద్దు.. ఇన్వెస్టర్లు దూరం | Analysis: Gold just another asset to sell in coronavirus crash, Why?

Gold futures fell sharply Thursday, settling at a nearly two-week low under $1,600 an ounce, as a selloff in the stock market sent traders scrambling to sell positions in the precious metal in a bid for cash.
Story first published: Friday, March 13, 2020, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X