భారత్‌లో విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలన్న తేడా లేకుండా ఎయిర్‌లైన్స్ నష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల్ని ప్రైవేటీకరణతో వదిలించుకనేందుకు కేంద్రం ఎలాగో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రైవేటు సంస్ధలే ఇటు కొనసాగలేక, అలాగని ఎత్తేయలేక నష్టాల భారంతో నలిగిపోతున్నాయి. దీంతో ఎయిర్‌లైన్స్ అందించే సేవల్లో చిన్నపాటి మార్పు ద్వారా ఛార్జీల తగ్గింపుకు డీజీసీఏ అనుమతి ఇచ్చింది.

ఎయిర్‌లైన్స్ సేవలపై డీజీసీఏ కీలక నిర్ణయం
భారత్‌లో ఎయిర్‌లైన్స్ సంస్ధలు అందిస్తున్న పలు సేవలు ప్రయాణికులకు భారంగా మారిపోయాయి. ప్రయాణ ఛార్జీలతో పాటు పలు సేవలకు కూడా కలిపి ఛార్జీల వడ్డన సాగిస్తుండటంతో విమాన యాన సంస్ధలు నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. కరోనాకు ముందే నష్టాల్లో కునారిల్లుతున్న విమానయాన సంస్ధల్ని లాక్‌డౌన్, ఇతర సమస్యలు పూర్తిగా మూతపడే పరిస్ధితికి తీసుకొచ్చాయి. దీంతో విమానయాన సంస్ధలు కేంద్రం, డీజీసీఏ ముందు పలు ప్రతిపాదనలు పెట్టాయి. ఇందులో ఓ కీలక ప్రతిపాదనకు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఇక ఆ సేవల్నీ విడివిడిగానే
విమానాల్లో ప్రస్తుతం అందిస్తున్న ప్రాధాన్యతా సీట్లు, భోజనం, ఎయిర్‌పోర్ట్ లాంజ్ వాడకం, బ్యాగేజ్ చెకిన్, క్రీడా, సంగీత పరికరాల రవాణా సేవలు బండిల్ విధానంలో (అన్నీకలిపి) లభిస్తున్నాయి. ఇప్పుడు వీటిని విడగొట్టి ప్రయాణికులకు అవసరమైన వాటికి మాత్రమే ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేయాలని ఎయిర్‌లైన్స్ సంస్ధలు నిర్ణయించాయి. ఎయిర్‌లైన్స్ సంస్ధల ప్రతిపాదనకు డీజీసేఏ కూడా అనుమతి ఇవ్వడంతో ప్రయాణికులపై ఆ మేరకు ఛార్జీల భారం తగ్గబోతోంది. అలాగే ఎలాంటి బ్యాగేజ్ లేకుండా ప్రయాణం చేసే వారికి జీరో బ్యాగేజ్ లేదా చెక్ ఇన్ ఛార్జీలు తిరిగి చెల్లించేందుకు కూడా ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ భారం కూడా తగ్గిపోనుంది.

ఛార్జీలు తగ్గుతాయంటున్న డీజీసీఏ
వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞాపనల మేరకు విమానయాన సంస్ధలు అందించే సేవల్ని విడదీసి అందించేందుకు తాము అనుమతించిటన్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. దీని వల్ల ప్రయాణికులు తమకు అవసరమైన సేవల్ని మాత్రమే ఛార్జీలు చెల్లించి తీసుకుంటారని, అవసరం లేని మిగతా సేవల్ని కూడా తప్పనిసరిగా భరించాల్సిన ఆగత్యం తప్పుతుందని డీజీసీఏ తెలిపింది. దీని వల్ల ప్రయాణికులపై ఛార్జీల భారం కూడా తగ్గుతుందని డీజీసీఏ చెబుతోంది.

ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ మార్గదర్శకాలు
ఎయిర్‌లైన్స్ సంస్ధలు తాము కోరుకున్న విధంగా ప్రయాణికులకు తమ సేవల్ని విడదీసి అందించాలనుకుంటే ముందుగు డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాలి. అఫ్పుడు డీజీసీఏ వాటిని పరిశీలించి అనుమతి మంజూరు చేస్తుంది. అలా కాకుండా పాత విధానంలోనే కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత పోటీ వాతావరణంలో తమ సేవల్ని విడివిడిగానే అందించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్ధలు ముందుకు రావొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్‌లైన్స్ సంస్ధలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తోంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications