For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎం గోల్డ్ కస్టమర్లకు బంపరాఫర్: ఇక గోల్డ్ షాపుల్లో బంగారం తీసుకోవచ్చు

|

మీరు పేటీఎం గోల్డ్ కస్టమరా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్.. మీరు ఇప్పటిదాకా కొనుగోలు చేసి దాచిపెట్టుకున్న బంగారాన్ని భౌతిక రూపంలో మీరు చాలా సులభంగా తీసుకునే అవకాశం కల్పిస్తోంది పేటీఎం. ఇందుకోసం పలు ప్రముఖ ఆభరణాల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త కస్టమర్లను సంపాదించుకొని తన వ్యాపారాన్ని మరింతగా పెంచుకునే చర్యల్లో భాగంగా పే టీఎం ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు మరింత సులభం బంగారాన్ని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

వారికి రూ.4,000 ఇచ్చి, మాకు రూ.400 ఇస్తున్నారు: అమిత్ షాకు జగన్వారికి రూ.4,000 ఇచ్చి, మాకు రూ.400 ఇస్తున్నారు: అమిత్ షాకు జగన్

ఎక్కడ తీసుకోవచ్చంటే...

ఎక్కడ తీసుకోవచ్చంటే...

* పే టీఎం తన కస్టమర్లకు సౌకర్యంగా ఉండేందుకుగాను పెద్దపెద్ద జ్యూవెలరీ కంపెనీలతో జట్టుకట్టింది. వీటిలో కళ్యాణ్ జువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, క్యారట్ లైన్ వంటివి ఉన్నాయి. వీటి దగ్గరికి వెళ్లి పేటీఎం గోల్డ్ కస్టమర్లు తమ వద్ద ఉన్న డిజిటల్ బంగారాన్ని భౌతిక బంగారంలోకి మార్చుకోవచ్చు.

* ప్రారంభ ఆఫర్ కింద పేటీఎం గోల్డ్ ను వినియోగించి లావాదేవీ జరిపితే 5 శాతం గోల్డ్ బ్యాక్ ఆఫర్ను ఇస్తోంది.

* ప్రస్తుతం ఈ సదుపాయం 100కు పైగా స్టోర్లలో అందుబాటులో ఉందట. వచ్చే 20 రోజుల్లో మరో 250 స్టోర్లలో అందుబాటులోకి తీసుకురావాలని పేటీఎం భావిస్తోంది.

* మరిన్ని సంస్థలతోను పేటీఎం చర్చలు జరుపుతోంది. దీని వల్ల ప్రధాన నగరాలూ, పట్టణాల్లోని కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

* పేటీఎమ్ గోల్డ్ ఉచితంగా ఇన్సూర్డ్ లాకర్లు, రియల్ టైం మార్కెట్ లింక్డ్ ధరలు, 25 వేల పిన్ కోడ్స్ కు డెలివరీ, గోల్డ్ సేవింగ్స్, గోల్డ్ గిఫ్టింగ్ వంటి సదుపాయాలను అందిస్తోంది.

ఎవరు ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారంటే...

ఎవరు ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారంటే...

* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటున్నాయి.

* మిలీనియల్స్, పని చేస్తున్న ప్రొఫెషనల్స్, గృహిణులు ఎక్కువగా పేటీఎం గోల్డ్ కొనుగోలు చేస్తున్నారట.

*దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి, పండగల కోసమే కాకుండా అత్యవసరాల్లో వినియోగించుకోవడానికి బంగారాన్ని తీసుకుంటున్నట్టు కొనుగోలుదారులు చెబుతున్నారు.

భారీ అమ్మకాలు టార్గెట్...

భారీ అమ్మకాలు టార్గెట్...

* దీపావళి, దంతేరస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ఈ పండగ సీజన్లో పేటీఎం గోల్డ్ అమ్మకాలు మూడు రేట్లు పెంచుకోవాలని పేటీఎం భావిస్తోంది.

* రెండేళ్ల క్రితం పేటీఎం గోల్డ్ ను అందుబాటులోకి తెచ్చారు. 3 కోట్లకు పైగా కస్టమర్లు 4.2 టన్నులకుపైగా బంగారం లావాదేవీలు నిర్వహించినట్టు సంస్థ చెబుతోంది.

* డిజిటల్ గోల్డ్ లో పేటీఎం హవా సాగుతోంది. ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటం విశేషం.

* వివిధ రకాల డిజిటల్ పేమెంట్ సంస్థలు కూడా బంగారాన్ని కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

English summary

పేటీఎం గోల్డ్ కస్టమర్లకు బంపరాఫర్: ఇక గోల్డ్ షాపుల్లో బంగారం తీసుకోవచ్చు | Paytm Gold can now be redeemed at jewellery stores

Digital payments leader Paytm on Wednesday announced that Paytm Gold is now redeemable at the leading jewellery stores across the country as part of Paytm Mall's overall O2O strategy.
Story first published: Thursday, October 24, 2019, 10:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X