న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో రెండు చమురు క్షేత్రాలపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 642 పాయింట్లు కోల్పోయి 36,481 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 186 పాయింట్లు నష్టపోయి 10,817 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 నష్టాలను చవి చూశాయి. మార్కెట్ నష్టాలకు ఆయిల్ సహా పలు కారణాలు ఉన్నాయి. మరోవైపు రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు.

రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల నష్టం
మార్కెట్ పతనం నేపథ్యంలో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే లిస్టెట్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లు తగ్గి రూ.139.70 లక్షల కోట్లకు పడిపోయింది. వరుసగా రెండు రోజులు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.2.72 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ రెండు రోజుల్లో అక్షరాలా రూ.2,72,593.54 కోట్లు తగ్గి రూ.1,39,70,356.22 కోట్లకు చేరుకుంది.

చమురు సంక్షోభం
మార్కెట్ల నష్టానికి పలు కారణాలు ఉన్నాయి. సోమవారం బ్రెంట్ చమురు బారీగా పెరగడంతో మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. మంగళవారం ధరలు స్థిరపడినప్పటికీ సరఫరాపై అనిశ్చితి కొనసాగింది. సోమవారం నాటితో పోలిస్తే ముడి చమురు ధర నిలకడగానే ఉంది. ధరలు తగ్గినా ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు. సౌదీ అరేబియా నుంచి ముడి చమురు ఎగుమతులు సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరో వారం పది రోజులు పడుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు ఇరాన్ పైన సైనిక చర్యకు సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా కారణం.

చైనా మందగమనం
ఆగస్ట్ నెలలో చైనా పారిశ్రామిక ఉత్పత్తి 4.4 శాతం తగ్గింది. ఇది పదిహేడేళ్ల కనిష్టం. చైనా తయారీ మందగమనాన్ని సూచిస్తోంది. ఇది మార్కెట్ పైన ప్రభావం పడిందని చెబుతున్నారు.

ఆటో సేల్స్
ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో డిమాండ్ మరింత తగ్గవచ్చుననే అంచనాలతో వాహన షేర్లు మరింతగా దిగజారాయి. హీరో, టాటా మోటార్స్, మారుతీ సుజుకీలతో కూడిన నిఫ్టీ వాహన సూచీ 3.83 శాతం క్షీణించింది.

ఫెడ్ సమావేశం
అమెరికా ఫెడ్ పరపతి సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. వడ్డీ రేట్ల కోత ఉండవచ్చునని భావిస్తున్నారు. మరిన్ని గణాంకాల కోసం ఫెడ్ ఎదురు చూడవచ్చునని చెబుతున్నారు.

రూపాయి పతనం..
డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కూడా మార్కెట్‌ను భయపెట్టింది. మంగళవారం ఆరంభంలో డాలర్ మారకంతో రూపాయి 71.83గా ప్రారంభం కాగా, ఇంట్రాడేలో ఓ దశలో 71.98 వరకు పతనమైంది. చివరలో కాస్త కోలుకొని 18 పైసల నష్టంతో 71.78 వద్ద క్లోజ్ అయింది. ఇటీవల ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా ఉండవచ్చు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications