ఇప్పుడిప్పుడే తగ్గుతున్న బంగారం ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. ఫెస్టివల్ సీజన్‌కు తోడు సౌదీ అరేబీయాలోని రెండు చమురు క్షేత్రాలపై దాడి ప్రభావం బంగారంపై కూడా పడింది. కొద్ది రోజుల క్రితం 10 గ్రాముల 99.9 ప్యూరిటీ కలిగిన బంగారం ధర రూ.40,000 పైకి చేరుకున్నా తర్వాత రూ.38,000కు దిగివచ్చింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో పసిడి ధరలు కూడా పెరిగాయి.

పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో ఎంతంటే..
సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 12 డాలర్లు పెరిగి రూ.1,504 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావం భారత్ పైన కూడా పడింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.460 పెరిగి రూ.38,860కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.1,096 పెరిగి రూ.47,957కు చేరింది. హైదరాబాదులో సోమవారం రాత్రికి 10 గ్రాముల బంగారం ధర రూ.39,100 పలికింది. వెండి కిలో రూ.47,500గా ఉంది.

రూపాయి మారకం ఎఫెక్ట్ కూడా...
డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా పసిడి, వెండి వంటి లోహాలు అధికం కావడానికి దోహదపడింది. శనివారం బంగారం ధర రూ.38,400 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ గోల్డ్‌లో రాత్రి ఏడున్నర గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1.10 శాతం లేదా రూ.413 పెరిగి రూ.37,937 వద్ద ఉంది. శుక్రవారం బంగారం రూ.37,503 వద్ద క్లోజ్ అయింది. సోమవారం సాయంత్రానికి 1.7 శాతం పెరిగి రూ.38,163 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో వెండి 3 శాతం లేదా రూ.1326 పెరిగి రూ.47,087 వద్ద ఉంది.

1 శాతం పెరిగిన బంగారం..
చమురు క్షేత్రాలపై దాడి నేపథ్యంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1 శాతం పెరిగాయి. పలువురు ఇన్వెస్టర్లు పెట్టుబడులకు స్వర్గదామంగా భావిస్తున్న పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.

అందుకే ధరలు పుంజుకున్నాయి..
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు కారణంగా వెండి కిలో రూ.1,096 పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ తపన్ పటేల్ అన్నారు. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,504 డాలర్లు ఉండగా, వెండి 17.87 డాలర్లకు చేరుకుంది. మధ్య ప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయన్నారు.
More From GoodReturns

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Silver price: బంగారం పని అయిపోయిందా? వెండి వైపు ఇన్వెస్టర్ల క్యూ.. 2026లో కోటీశ్వరులయ్యే ఛాన్స్!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!



Click it and Unblock the Notifications