For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరేళ్ళ గరిష్టానికి సమీపంలో... అందుకే బంగారానికి భారీ డిమాండ్

|

బంగారం ధరలు బుధవారం కాస్త స్థిరంగా ఉన్నాయి. ఇంతకుముందు సెషన్‌లో 1 శాతం పెరిగింది. తద్వారా ఆరేళ్ల గరిష్ట ధరకు సమీపంలో ఉంది. బలహీన యూఎస్ డేటా, అమెరికా - చైనా ట్రేడ్ వార్, బ్రెగ్జిట్ వంటి అంశాల కారణంగా అంతర్జాతీయంగా మందగమనం కొనసాగుతోంది. దీంతో చాలామంది బంగారం పైన ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,543.02గా ఉంది. గతవారం $1,554.56 రికార్డ్ హైకి చేరుకుంది. 2013 నుంచి ఇదే అత్యధికం. దీనికి సమీపంలో ఉంది. యూఎస్ గోల్డ్ ఫీచర్స్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,552.4 వద్ద ఉంది. వెండి 0.7 శాతం తగ్గి ఔన్సుకు $19.37 వద్ద ఉంది. సెప్టెంబర్ 2016 తర్వాత ఇటీవల $19.57 రికార్డ్ హైకి చేరుకుంది. దీనికి సమీపంలో ఉంది.

ట్రాఫిక్ ఉల్లంఘిస్తున్నారా.. జాగ్రత్త: ఇతనికి రూ.23,000 ఫైన్ట్రాఫిక్ ఉల్లంఘిస్తున్నారా.. జాగ్రత్త: ఇతనికి రూ.23,000 ఫైన్

బంగారంపై పెట్టుబడి

బంగారంపై పెట్టుబడి

అమెరికా - చైనా ట్రేడ్ విషయంలో ఎలాంటి వృద్ధి కనిపించడం లేదు. చైనా విషయంలో కఠినంగా ఉంటానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది బంగారంపై పెట్టుబడులు చేస్తున్నారు. డైవోర్స్ అగ్రిమెంట్ లేకుండా ఈయూ నుంచి వెలుపలికి వెళ్లే అంశంలో బ్రిటిష్ లామేకర్స్ మంగళవారం పార్లమెంటులో బోరిస్ జాన్సన్‌ను ఓడించారు. ఎన్నికలకు సిద్ధమని ప్రకటించాలన్నారు.

బంగారం, వెండికి ఎప్పటికప్పుడు డిమాండ్

బంగారం, వెండికి ఎప్పటికప్పుడు డిమాండ్

భారత ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పటికి అప్పుడు గరిష్టస్థాయికి చేరుకుంటుందని చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా ఓ ఇంగ్లీష్ బిజినెస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈక్విటీ మార్కెట్లో భారీ సేల్స్ బంగారం వంటి వాటికి డిమాండ్ పెంచిందన్నారు.

రూపాయి మిశ్రమం...

రూపాయి మిశ్రమం...

ప్రస్తుత భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రూపాయి మిశ్రమంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లోని ఆయిల్ మార్కెట్ టెన్షన్స్ రూపాయిని మరింత బలహీనపరుస్తాయన్నారు. భారత్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ఎప్పటికప్పుడు గరిష్టస్థాయికి చేరుకుంటుందన్నారు.

మాంద్యం భయాలు

మాంద్యం భయాలు

కేంద్రం జీఎస్టీ రేట్ల కోతలు, కార్పోరేట్స్ పైన ప్రత్యక్ష పన్నులు సడలించడం వంటి కొత్త ప్రణాళికలు, విధానాలతో రావొచ్చునని, ఇవి విదేశీ పెట్టుబడులను పెంచవచ్చునని, అలాగే రూపాయి బలహీనతను పరిమితం చేయవచ్చునని చెప్పారు. వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ మాంద్యం భయాలు రూపాయిని అస్థిరంగా ఉంచవచ్చునని చెప్పారు.

English summary

ఆరేళ్ళ గరిష్టానికి సమీపంలో... అందుకే బంగారానికి భారీ డిమాండ్ | Gold steady near six year high on growing recession fears

Gold held steady on Wednesday after rising 1% in the previous session, with prices hovering near a more than six-year high on heightened fears of a global recession following weak U.S. data, the prolonged Sino-U.S. trade spat and Brexit uncertainties.
Story first published: Wednesday, September 4, 2019, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X