ముంబై: మే 2019 నుంచి నిఫ్టీ దాదాపు 10 శాతానికి పైగా నష్టపోయింది. అదే సమయంలో ఇండెక్స్ 12,000 పాయింట్ల మార్క్ కూడా దాటింది. వృద్ధి రేటు నెమ్మదించడం, విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు, ప్రపంచ మార్కెట్లో తీవ్ర అస్థిరతలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఆటో సేల్స్ సహా ఎన్నో మందగమనంతో కొనసాగుతున్నాయి. మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఎల్ఐసీ వంటి సంస్థను కూడా తాకింది.

భారం మోస్తున్న ఎల్ఐసీ
డిసెంబర్ నుంచి 80 శాతం ఎల్ఐసీ పోర్ట్‌పోలియోలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కనిపిస్తోంది. కానీ ఎక్కువగా ప్రయోజనకరంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వరంగ సంస్థల బెయిలవుట్ కోసం ఇది స్టాక్స్ కొనుగోలు చేయవలసి వచ్చింది. గత ఏడాది హిందూస్తాన్ ఏరోనాటిక్స్ 70 శాతంతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా బెయిలవుట్ చేసింది.

సేవియర్..
ఒక ప్రభుత్వరంగ సంస్థ ఐపీవో పడిపోవడంతో పలు సందర్భాల్లో ఎల్ఐసీ సేవియర్‌గా మారింది. ఎన్పీఏలు నియంత్రణ లేని ఐడీబీఐ వంటి బ్యాంకును ఆదుకుంది. బ్యాంకింగ్ రంగంలో అత్యంత ఎక్కువ ఎన్పీఏలు కలిగి ఉన్నది ఐడీబీఐ. ఎల్ఐసీ, ప్రభుత్వం కలిపి ఐడీబీఐ బ్యాంకులోకి రూ.9,000 కోట్లు ఇన్‌ఫ్యూజ్ చేయాలని ఇటీవలే నిర్ణయించాయి.

స్టాక్స్ కొనుగోలు సమయంలో నిర్ణయాలు సరైనవిగా ఉండవచ్చు
వ్యాపార పరిస్థితులు చాలా వేగంగా మలుపు తిరుగుతున్నాయి. పలువురు తెలివైన ఇన్వెస్టర్లు ఎల్ఐసీని వదిలివేయవచ్చు. కొన్నేళ్ల క్రితం కాక్స్ అండ్ కింగ్స్ చాలా సంస్థాగత పెట్టుబడిదారులకు ఎంతో ఇష్టమైనవి. అలాగే ఎల్ఐసీని కూడా చాలామంది ఎంచుకుంటారు. ఎల్ఐసీ పోర్ట్‌పోలియో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. అయితే పెరుగుతున్న అప్పులు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు ఎల్ఐసీ పోర్ట్ పోలియో నష్టాలకు కారణంగా భావిస్తున్నారు. స్టాక్స్ కొనుగోలు చేసే సమయంలో మన నిర్ణయాలు సరైనవిగానే ఉండవచ్చు.
కాక్స్ అండ్ కింగ్స్, ఎల్ఐసీ వలె చాలా మ్యుచువల్ ఫండ్స్ కూడా ఇలాగే చిక్కుకున్నాయి. ఎల్ఐసీ దెబ్బ ఆడాగ్ గ్రూప్ స్టాక్స్ కావొచ్చు. ఎల్ఐసీ ఇతర మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లేదా డెబిట్‌లో చిక్కుకుంటాయి. ఇది ఆ గ్రూప్ స్టాక్స్ పైన పడుతుంది.

కొన్ని కంపెనీలపై ఆసక్తి
మ్యూచువల్ ఫండ్స్ సహా సంస్థాగత పెట్టుబడిదారులు ఇప్పుడు మంచి షేర్ల పైనే దృష్టి సారిస్తున్నారు. కాక్స్ అండ్ కింగ్స్ స్టాక్స్ అనుభవం చాలామందికి పాఠాలు నేర్పింది. ఎందుకంటే ఆ తర్వాత ఇది భారీగా నష్టపోయింది. చాలామంది సంస్థాగత పెట్టుబడిదారులు HDFC, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌కు దాదాపు దూరంగా ఉంటున్నారు. కానీ గతంలోని నిర్ణయాల వల్ల ఇప్పుడు ఏమైనా జరిగితే తప్పించుకోలేరు. ప్రస్తుతం సంస్థాగత పెట్టుబడిదారులు గత తమ నిర్ణయాల భారాన్ని మోయవలసి ఉంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications