మీ ఇన్‌కం ట్యాక్స్ మారనుందా? పన్ను కట్టే వారికి భారీ ఊరట?

న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా.. అంటే అవుననే అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ టాస్క్ ఫోర్స్ కొత్త పన్నుల విధానానికి సంబంధించిన నివేదికను ఆర్థికమంత్రిత్వ శాఖకు సమర్పించింది. పాత ఆదాయపన్ను చట్టం-1961లో పలు మార్పులు తీసుకురానుంది. తాజా మార్పుల్లో పన్ను చెల్లింపుదారులకు రాయితీలు అందించనుందని తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక తిరోగమనం నేపథ్యంలో వారి వినిమయ శక్తిని పెంచనుంది.

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇవి కూడా చదవండి...

ఒకే చేస్తే... తగ్గనున్న ట్యాక్స్

ఒకే చేస్తే... తగ్గనున్న ట్యాక్స్

సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (CBDT) సభ్యులు అఖిలేష్ రంజన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అంగీకరిస్తే ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం కలిగి ఉన్న వారు కేవలం 10 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య సంపాదన కలిగిన వారికి పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్‌ను కేవలం 20 శాతానికి తగ్గించాలనే ప్రతిపాదన చేశారని తెలుస్తోంది.

సూపర్ రిచ్‌కు...

సూపర్ రిచ్‌కు...

అలాగే, రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు సంపాదనపై 30 శాతం పన్నును, రూ.2 కోట్లు ఆ పైన సంపాదనపై 35 శాతం పన్నును నసూలు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అధిక ఆదాయం (సూపర్ రిచ్) ఉన్న వర్గాలకు కొత్తగా 35 శాతం శ్లాబును ప్రతిపాదించింది. తక్కువ ఆదాయ సంపాదన నుంచి ఎక్కువ ఆదాయ సంపాదన వరకు వరుసగా చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం పెంచారు.

DDT రద్దు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌కు ఓకే

DDT రద్దు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌కు ఓకే

పన్నుల భారాన్ని తగ్గించడానికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT)ని రద్దు చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను మాత్రం కొనసాగించాలని పేర్కొంది. DDT తొలగించాలనే ఆలోచన వెనుక ఉద్దేశ్యం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమేనని అంటున్నారు.

DDTపై ఎందుకంటే...

DDTపై ఎందుకంటే...

సాధారణంగా కంపెనీలు షేర్ హోల్డర్స్‌కు పంపిణీ చేసే డివిడెండ్ పైన 15% పన్ను చెల్లించాలి. దీనికి అదనంగా 12% సర్‌చార్జ్, 3% ఎడ్యుకేషన్ సెస్‌ను కలిపితే డివిడెండ్ పైన నికర పన్ను ఎక్కువ అవుతోంది. డివిడెండ్ పైన కార్పొరేట్‌ ట్యాక్స్, DDT, ఇన్వెస్టర్ ఇలా మూడుసార్లు పన్ను భారం పడుతున్నట్టు మార్కెట్‌ పార్టిసిపెంట్స్ ఇటీవల ఆర్థికమంత్రితో భేటీ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదన్నారు. దీంతో DDTని రద్దు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంది. ఐతే డివిడెండ్ పైన పన్నుకు కంపెనీలే చెల్లిస్తున్నందున దానిపై వారు క్రెడిట్ పొందే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి దానికి బదులు సంప్రదాయ విధానంలో పన్ను వేయాలనేది ప్రతిపాదన. డీడీటీ రద్దు చేస్తే ఆదాయంపై బహుళ పన్నులు తొలగి, కంపెనీలపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు. దీనిని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దానిని ఆదాయంగా చూపించి పన్ను చెల్లించవలసి ఉంటుంది.

ఇప్పుడున్న ఆదాయపన్ను...

ఇప్పుడున్న ఆదాయపన్ను...

ఇప్పటి వరకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారు 20 శాతం, రూ.10 లక్షలకు పైన సంపాదించేవారు 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉన్నప్పటికీ పొదుపు చేసి రాయితీలు ఉపయోగించుకుంటే రూ.5 లక్షల వరకు పన్ను భారం ఉండదు.

5 కేటగిరీలుగా ట్యాక్స్...

5 కేటగిరీలుగా ట్యాక్స్...

ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... ఈ టాస్క్ ఫోర్స్ ఐదు కేటగిరీల ట్యాక్స్‌ను ప్రతిపాదించింది. ఇప్పుడున్న 5 శాతం, 20 శాతం, 30 శాతానికి బదులుగా... 5 శాతం, 10 శాతం, 20 శాతం, 30 శాతం, 35 శాతంను ప్రతిపాదించిందని తెలుస్తోంది.

ఎవరికెంత శాతం తగ్గుతుందంటే...

ఎవరికెంత శాతం తగ్గుతుందంటే...

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఆదాయంపై ప్రభుత్వం 20 శాతం వసూలు చేస్తుండగా దానిని 10 శాతానికి తగ్గించాలని సిఫార్సు చేసింది. రూ.10 లక్షలు దాటితే 30 శాతం కట్టాల్సి ఉండగా దానిని 20 శాతానికి కుదించారు. రూ.2 కోట్ల వరకు 30 శాతం, రూ.2 కోట్లకు పైగా ఎంత ఆదాయం ఉన్నా 35 శాతం చెల్లించవలసి ఉంటుంది.

ఎలాగూ రిబేట్ ఉంది..

ఎలాగూ రిబేట్ ఉంది..

రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయంపై ఎలాగూ పన్ను రిబేట్ ఉంది. కాబట్టి రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశముంది. 58 సంవత్సరాలుగా ఉన్న ఆదాయ పన్ను చట్టాన్ని మార్చడం, పన్ను విధానంలో సరళీకరణ లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయాల్సి ఉంది.

మధ్య తరగతి చేతిలో డబ్బులుంటే వినియోగం..

మధ్య తరగతి చేతిలో డబ్బులుంటే వినియోగం..

మధ్య తరగతి చేతిలో డబ్బులు ఉంటే వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఇందుకు అనుగుణంగా పన్ను విధానాలు ఉండాలని కమిటీ ప్రతిపాదన. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్‌ను పక్కన పెట్టాలని చెప్పింది. పన్నులపై సర్ ఛార్జీలు వద్దని తెలిపింది. ఒకవేళ విధించినా తాత్కాలికంగా మాత్రమే ఉండాలని తెలిపింది. కాగా, ఈ టాస్క్ ఫోర్స్ గడువును మూడుసార్లు పొడిగించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+