For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ జోరు: సెన్సెక్స్ 600 పాయింట్ల లాభానికి ఎగిసి... అంతలోనే..

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు వివిధ రంగాలకు ఊరటనిచ్చేలా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు జోష్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అంచనాలకు తగినట్లుగానే మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. FPIలపై సర్‌ఛార్జీని, అలాగే, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పైన పన్నును ఉపసంహరించుకోవడం మార్కెట్లకు ఉత్తేజం తెచ్చింది. అలాగే, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు.

ఉదయం గం.9.15 నిమిషాలకు సెన్సెక్స్ 662 పాయింట్లు ఎగిసి 37,363.95 వద్ద, నిఫ్టీ 305.95 పెరిగి 11,135.30 వద్ద ప్రారంభమైంది. మరోవైపు డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 37 పైసలు బలహీనపడి 72.03 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత పదిగంటల సమయానికి సెన్సెక్స్ 20 పాయింట్లు పెరిగి 36,720.68 వద్ద, 9.85 (0.091%) పాయింట్లు తగ్గి 10,819.95 వద్ద ట్రేడ్ అయింది.

<strong>మాంద్యంలేదు, ఆటో సేల్స్ తగ్గడానికి ఉబెర్-ఓలా కారణమే!?</strong>మాంద్యంలేదు, ఆటో సేల్స్ తగ్గడానికి ఉబెర్-ఓలా కారణమే!?

Market Updates: Sensex surges over 600 points, Nifty above 11,100

ఎన్ఎస్ఈలో ఉదయం యస్ బ్యాంకు, వొడాఫోన్ ఐడియా, అశోక్ లేలాండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, డీఎల్ఎఫ్ లిమిటెడ్, ఉత్తమ్ వ్యాల్యూ స్టీల్ లిమిటెడ్ వంటివి లాభాల బాటలో పయనించాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయింది.

ఆయిల్ ధరలు దాదాపు రెండు వారాల కనిష్టానికి పడిపోయాయి. అమెరికా - చైనా ట్రేడ్ వార్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 63 సెట్లు (1.1 శాతం) తగ్గి $58.71 ట్రేడ్ అయింది. అంతకుముందు ఆగస్ట్ 15వ తేదీన ఇది $58.24 కనిష్టాన్ని తాకింది.

English summary

మార్కెట్ జోరు: సెన్సెక్స్ 600 పాయింట్ల లాభానికి ఎగిసి... అంతలోనే.. | Market Updates: Sensex surges over 600 points, Nifty above 11,100

At 9.15 am, the Sensex was up 662 points at 37,363.95 The Nifty was at 11,135.30, up 305.95 points or 2.83 per cent higher.
Story first published: Monday, August 26, 2019, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X