స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపధ్యంలో నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అక్కడి నుంచి కొద్దిగా లాభాల్లోకి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. ఉదయం నుంచి సెల్లింగ్ ప్రెషర్ కొనసాగింది. ఇంట్రాడేలో 10985 పాయింట్ల కనిష్ట స్థాయికి నిఫ్టీ దిగొచ్చింది. చివరి సెషన్‌లో మళ్లీ నిఫ్టీ నిలదొక్కుకోలేకపోయింది. చివరకు సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 37328 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 37 పాయింట్లు దిగొచ్చి 11,017 దగ్గర స్థిరపడింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ మరింత దిగొచ్చింది. సుమారు 200 పాయింట్లు కోల్పోయి 27982 దగ్గర క్లోజైంది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒక్క శాతం వరకూ దిగొచ్చాయి. ఇక సెక్టోరల్ ఇండిసెస్‌లో మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో ఎక్కువ సెల్లింగ్ నమోదైంది. ఆటో, ఐటీ రంగ షేర్లు కొద్దిగా కోలుకున్నాయి.
మారుతి సుజుకి, టాటా మోటార్స్, హెచ్ సి ఎల్ టెక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మారుతీ కోలుకుంది
వరుస పతనాలతో ఇబ్బందిపడ్తున్న మారుతి సుజుకి షేర్ కాస్త తేరుకుంది. మళ్లీ రూ.6000 మార్కు పైన స్థిరపడింది. ఈ ఏడాది మూడు, నాలుగు క్వార్టర్లలో ఆటో ఇండస్ట్రీ కోలుకోవచ్చనే నమ్మకం తమకు ఉందని మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనాల అమ్మకాలకు- ఆర్థిక మందగమనాన్ని కలిపి చూడలేమని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో స్టాక్ కాస్త తేరుకుంది. చివరకు రూ.6200 దగ్గర క్లోజైంది.
సిజి పవర్‌కు షాక్ కొట్టింది
కంపెనీలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారనే వార్తల నేపధ్యంలో స్టాక్ కుప్పకూలింది. సంస్థ ఆర్థిక వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌ను నియమించబోతున్నట్టు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో స్టాక్ 20 శాతం లోయర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయింది. రూ.14.75 దగ్గర స్టాక్ ముగిసింది.
ఈ సంస్థకు ఎక్స్‌పోజర్ ఉన్న యెస్ బ్యాంక్‌ను కూడా మార్కెట్ వదల్లేదు. స్టాక్ 7 శాతం నష్టపోయింది. చివరకు రూ.71.55 దగ్గర క్లోజైంది.
మూడేళ్ల తర్వాత మహా లాభాలు
సహజవాయు డిస్ట్రిబ్యూషన్ సంస్థ మహానగర్ గ్యాస్‌కు స్టాక్ ఈ రోజు ఇంట్రాడేలో భారీగా లాభపడింది. మూడేళ్ళ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఇంట్రాడేలో 12 శాతానికి పైగా పెరిగింది. సంస్థలో తమ వాటాను అమ్మాలని షెల్ నిర్ణయించుకుందనే వార్తలు వచ్చినప్పటికీ స్టాక్ మాత్రం లాభాల్లో దూసుకపోయింది. చివరకు 8 శాతం లాభాలతో రూ.848 దగ్గర క్లోజైంది.
స్టెర్లింగ్ వీక్ లిస్టింగ్
షాపూర్‌జీ పల్లోంజీకి చెందిన సోలార్ విద్యుత్ సంస్థ స్టెర్లింగ్- విల్సన్ కంపెనీ ఐపీఓ ఈ రోజు మార్కెట్లో లిస్ట్ అయింది. ఐపీఓ ధర కంటే 10.2 శాతం తక్కువగా రూ.700 దగ్గర స్టాక్ లిస్ట్ అయింది. చివరకు 7 శాతం నష్టాలతో రూ.725 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications