For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.40,000కు సమీపంలో బంగారం, కొనుగోలు చేసినా నష్టం లేదా?

|

బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం రూ.40వేల మార్క్‌కు చేరువగా ఉంది. మంగళవారం బులియన్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. జెవెల్లరీ మేకర్స్ నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో పసిడి ధర పెరుగుతోంది.

వెండి ధర కూడా కిలో రూ.1,11 పెరిగి రూ.43,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రూపాయి బలహీనపడుతుందటం, వ్యాపారుల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బంగారం ధర దిగి రావడం లేదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 1500 డాలర్లు దాటింది. పరిస్థితి చూస్తుంటే దీపావళి కంటే ముందే రూ.40వేల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది.

 Buy gold at any level, says Mark Mobius as central bankers ease

ఓ వైపు బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా, ఏమైనా ఫర్వాలేదు.. అంటే ఎంత ధర ఉన్నా బంగారం కొనుగోలు చేయండని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ సూచించారు. ధర పెరిగినప్పటికీ బంగారం కొనుగోలు చేస్తే నష్టమేమీ లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దీని విలువ పెరుగుతుందే తప్ప తరిగేది కాదంటున్నారు.

బంగారం విలువైనదని, దీని వ్యాల్యూ భవిష్యత్తులో పెరుగుతుందే తప్ప తరగదని మోబియస్ అభిప్రాయపడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే బంగారం ఏ స్థాయిలో ఉన్నా కొనుగోలు చేస్తే మంచిదని తెలిపారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధానికి తోడు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ప్రకటన, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పసిడి ధర పైపైకి ఎగురుతోంది.

English summary

రూ.40,000కు సమీపంలో బంగారం, కొనుగోలు చేసినా నష్టం లేదా? | Buy gold at any level, says Mark Mobius as central bankers ease

Veteran investor Mark Mobius gave a blanket endorsement to buying gold, saying that accumulating bullion will reap rewards over the long term as leading central banks loosen monetary policy and the rise of cryptocurrencies serves only to reinforce demand for genuinely hard assets.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X