For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై రుణాలకు గిరాకీ.. ఎందుకో తెలుసా.. ?

|

కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్ బీ ఎఫ్ సి)ల్లో చోటు చేసుకున్న సంక్షోభం మూలంగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరించడంలో తీవ్ర ఇబ్బందులను చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఈ సంస్థల రుణ వితరణ కూడా బాగా తగ్గి పోయింది. ఈ సంస్థల ఆటో, అన్ సెక్యూర్డ్ వ్యాపార రుణాలు, స్థిరాస్తి రుణాలు బాగా తగ్గి పోయాయి. ఇదిలా ఉంటే బంగారం తనఖా పై ఇచ్చే రుణాలు మాత్రం పెరుగుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Q1: JLR దెబ్బ, టాటా మోటార్స్ నికర నష్టం రూ.3,698 కోట్లుQ1: JLR దెబ్బ, టాటా మోటార్స్ నికర నష్టం రూ.3,698 కోట్లు

ఈ రుణాలకు డిమాండ్ ఎందుకంటే..

ఈ రుణాలకు డిమాండ్ ఎందుకంటే..

* ఈ మధ్య కాలంలో బంగారం ధరలు బాగా పెరిగి పోతున్నాయి. ఆర్ధిక సంస్థల నుంచి రుణం సులభంగా పొందలేని పరిస్థితుల్లో చాలా మంది బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

* చాలా రోజుల పాటు పది గ్రాముల బంగారం ధర రూ. 32,000 స్థాయిలో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో రూ. 35,000 స్థాయికి చేరుకుంది.

* ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాలకన్నా బంగారం తనఖాతో ఇచ్చే రుణాలకు ఎన్ బీ ఎఫ్ సి లు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

రుణాలకు డిమాండ్

రుణాలకు డిమాండ్

* బంగారం పై చాలా మంది స్వల్ప కాలానికే రుణం తీసుకుంటారు. ఈ రుణాల ఎగవేతలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ రుణాలు ఎగవేసే పరిస్థితి ఉంటే బంగారాన్ని విక్రయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ బీ ఎఫ్ సిలు బంగారంపై రుణం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి.

* బంగారంపై రుణాలు అనాది కాలం నుంచి అటు రుణ సంస్థలు ఇటు రుణ గ్రహీతలకు ప్రయోజనకరంగా ఉన్నాయి.

* బంగారంపై రుణ దాతలు 75 శాతం వరకు రుణాన్ని ఇవ్వడానికి భారత రిజర్వ్ బ్యాంకు అనుమతించింది. కాబట్టి ఆర్ధిక సంస్థలు ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతోంది. బంగారం ధర పెరిగింది కాబట్టి పసిడి తనఖాతో ఎక్కువ మొత్తం లభించే అవకాశం ఏర్పడుతోంది.

* బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది.

* గత నాలుగు త్రైమాసికాలనుంచి బంగారంపై రుణాలు పెరుగుతున్నాయి.

* వేగవంతంగా,సులభంగా ఈ రుణాలను పొందవచ్చు.

వ్యాపార సంస్థ లూ ఇదే బాటలో..

వ్యాపార సంస్థ లూ ఇదే బాటలో..

* వ్యక్తుల మాదిరిగానే వ్యాపార సంస్థలు కూడా బంగారం తనఖా తో రుణాలను తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

* ఎన్ బీ ఎఫ్ సి రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రుణాలు లభించడం గగనంగా మారిపోయింది.

* ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు తమకు అవసరమైన నిధులను ఈ మార్గంలో సమకూర్చుకుంటున్నాయి.

* చాలా ఆర్థిక సంస్థలు సులభంగా రుణాలను తిరిగి చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

* వడ్డీని నెలవారీ వాయిదాల్లో చెల్లించి అసలు మొత్తాన్ని రుణ మెచ్యూరిటీ కాలంలో చెల్లించే సదుపాయాన్ని కొన్ని ఎన్ బీ ఎఫ్ సి లు అందిస్తున్నాయి. దీన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు.

* రుణం పై ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపారాలు ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి.

English summary

బంగారంపై రుణాలకు గిరాకీ.. ఎందుకో తెలుసా.. ? | How gold loans became popular

Borrowing against gold is becoming more popular as the yellow metal's price reaches high these days.
Story first published: Friday, July 26, 2019, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X