For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నష్టాలపాలే ! రెండో రోజూ బ్యాంకుల బోల్తా

|

నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకోక ముందే ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో కుదేలయ్యేలా చేశాయి. ఆఖరి గంటలో వచ్చిన అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి లాభాలన్నింటినీ హరించేసి నష్టాలతో ముగిసేలా చేసింది. ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మన సూచీలు మాత్రం ఆందోళనతో వణికిపోతూనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ మరింతగా నీరసించింది. ఉదయం 11372 దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మధ్యాహ్నం తర్వాత 11398 పాయింట్ల గరిష్టం వరకూ వెళ్లింది. అయితే చివరి గంటలో అనూహ్యమైన అమ్మకాల నేపధ్యంలో నిఫఅటీ 11303 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే ఇక్కడ కొద్దిగా సపోర్ట్ లభించిన నేపధ్యంలో ముప్ఫై పాయింట్ల వరకూ రికవర్ అయింది. చివరకు 15 పాయింట్ల నష్టంతో 11331 పాయింట్ల దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 49 పాయింట్లు తగ్గి 37982 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్లు నీరసించింది 29128 దగ్గర ముగిసింది.

సూచీల పరంగా చూస్తే...మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం పావు శాతం లాభపడింది. ఎఫ్ఎంసిజి, ఐటీ, మీడియా, రియాల్టీ రంగానికి చెందిన స్టాక్స్ మాత్రమే కాస్త ఫరవాలేదనిపించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా రంగానికి చెందిన స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది.

మళ్లీ నష్టాలపాలే ! రెండో రోజూ బ్యాంకుల బోల్తా

పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఎస్బీఐ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ డి ఎఫ్ సి, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో స్టాక్స్ నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

కోటక్ హీరో పర్ఫార్మెన్స్

కొటక్ మహీంద్రా బ్యాంకు మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో ఈ రోజు కూడా మంచి లాభాలనే నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే స్థిరమైన పనితీరు ఆకట్టుకుంది. దీంతో కోటక్ బ్యాంక్ 2.75 శాతం లాభంతో రూ.1494 దగ్గర క్లోజైంది.

విఏ టెక్ వాబాగ్.. వహ్వా..

బిహార్ అర్బన్ ఇన్ఫ్రా సంస్థ నుంచి సుమారు రూ.1187 కోట్ల విలువైన ఆర్డర్లు పొందడంతో ఈ స్టాక్ పది శాతం వరకూ పెరిగింది. చివరకు 6.2 శాతం లాభంతో రూ.310 దగ్గర క్లోజైంది.

ఇండియన్ హోటల్స్ బ్లాక్ డీల్

సుమారు 10 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారాయి. ఇంతకు మించి పెద్ద వివరాలు లేనప్పటికీ స్టాక్ 2 శాతం వరకూ నీరసించింది. చివరకు రూ.142.50 దగ్గర క్లోజైంది.

కుప్పకూలిన వాటిలో కూల్ జంప్

ఈ మధ్య బాగా పతనమైన అనేక స్టాక్స్‌‌తో ఈ రోజు అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. దివాన్ హౌసింగ్ ఏకంగా 15 శాతం పెరిగింది. సంస్థలో పెట్టుబడులకు ఓ ఇన్వెస్టర్ ముందుకు వచ్చారనే వార్తలు స్టాక్‌ను పరుగులు తీయించాయి. చివరకు స్టాక్ రూ.60 దగ్గర క్లోజైంది.

ఇక పిసి జ్యువెలర్స్ 13 శాతం, మిందా ఇండస్ట్రీస్ 10 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 4 శాతం పెరిగాయి.

ఇదే బాటలో 8కె మైల్స్ 5 శాతం, తాన్లా సొల్యూషన్స్ 5 శాతం, రెడింగ్టన్, వెంకీస్, బజాజ్ కార్ప్ స్టాక్స్ కూడా ఐదు శాతంవరకూ పెరిగాయి.

బ్యాంకులకు పెద్ద కష్టం

ప్రభుత్వ - ప్రైవేట్ అనే సంబంధం లేకుండా బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్, ఎన్ బి ఎఫ్ సి రంగానికి చెందిన స్టాక్స్ కుప్పకూలుతూనే ఉన్నాయి.ఈ రోజు కూడా బంధన్ బ్యాంక్ 6.5 శాతం, గృహ్ ఫైనాన్స్ 6 శాతం, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, మోతిలాల్ ఒస్వాల్ 6 శాతం తగ్గాయి. ఇదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 5 శాతం నీరసించాయి.

English summary

Indices end volatile day in the red, Sensex dives below 38K

The Sensex was down 48.39 points at 37,982.74, while Nifty was down 15.20 points at 11,331.
Story first published: Tuesday, July 23, 2019, 18:51 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more