For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్‌లో మళ్లీ వణుకు ! నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

|

నిన్ననే కాస్త తేరుకున్నట్టు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మళ్లీ పడకేశాయి. ఆఖరి గంటలో వచ్చిన అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు కిందికి పడదోసింది. 11601 పాయింట్ల దగ్గర స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టీ.. 11639 వరకూ వెళ్లింది. అయితే ప్రారంభంలోనే నష్టాలు పెరగడంతో 11538 పాయింట్ల కనిష్టం వరకూ వెళ్లింది. వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ఆఖర్లో కోలుకున్నట్టు కనిపించినా అది కూడా నిలుపుకోలేకపోయింది. చివరకు 30 పాయింట్ల నష్టంతో 11552 దగ్గర ముగిసింది నిఫ్టీ. సెన్సెక్స్ 87 పాయింట్లు నష్టపోయి 38737 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్లు నష్టపోయి 30601 దగ్గర క్లోజైంది.

సెక్టోరల్ సూచీల్లో ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి, ప్రైవేట్ బ్యాంక్స్ నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా, రియాల్టీ, మీడియా రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్సులు రెండూ అర శాతం వరకూ లాభపడ్డాయి.

Sensex falls on fag end selling, down 87 pts: Nifty ends at 11,552

వేదాంతా, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, యెస్ బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. విప్రో, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఎళ్ అండ్ టి షేర్లు నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్

ఇండస్ ఇండ్ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. అయితే భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంస్థ విలీనం తర్వాత విడుదలవుతున్న ఫలితాలు కావడంతో వీటిని గత క్వార్టర్‌తో బేరీజు వేయడం కష్టమవుతుంది. నికర వడ్డీ ఆదాయం రూ.2844 కోట్లుగా నమోదు కాగా, నికర లాభం రూ.1432 కోట్లుగా ప్రకటించారు. స్థూల మొండిబకాయిలు 2.15 శాతం ఉండగా, నికర మొండిబకాయిలు (నెట్ ఎన్ పి ఏ) 1.23 శాతానికే పరిమితం కావడం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం. చివరకు స్టాక్ 1.57 శాతం నష్టంతో రూ.1517 దగ్గర క్లోజైంది.

డెన్ నెట్వర్క్స్ 3 నెలల గరిష్టం

డెన్ నెట్వర్క్స్ స్టాక్ 3 నెలల గరిష్టానికి చేరింది. మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన నేపధ్యంలో స్టాక్ ఉత్సాహంగా పరుగులు తీసింది. నికర లాభం రూ.11 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.31 కోట్ల నష్టం ఉండేది. ఆదాయం స్థిరంగా రూ.313 కోట్లుగా నమోదు కాగా, మార్జిన్లు కూడా స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది రోజుల నుంచి ఉత్సాహంగా పరుగులు తీసిన స్టాక్ ఈ రోజు కాస్త నిలదొక్కుకుంది. రూ.63.10 దగ్గర క్లోజైంది.

13 రోజూ పతనం

ఆర్థిక సంక్షోభం, డౌన్ గ్రేడ్స్ నేపధ్యంలో డిఫాల్ట్ కంపెనీగా మారిపోయేందుకు సిద్ధంగా ఉన్న కాక్స్ అండ్ కింగ్స్ స్టాక్‌లో నానాటికీ నష్టాలు పెరిగిపోతున్నాయి. గత పన్నెండు నెలల్లో స్టాక్ ఏకంగా 89 శాతం విలువ కోల్పోయింది. చివరకు ఈ రోజు కూడా 5 శాతం నష్టంతో రూ.22.05 దగ్గర ముగిసింది.

క్వెస్ కార్ప్ జంప్

అమెజాన్ డాట్ కామ్ సంస్థకు 7.54 లక్షల షేర్లను (రూ.50.99 కోట్లు) క్వెస్ కార్ప్ కేటాయించింది. ఈ నేపధ్యంలో ఈ స్టాక్ ఏకంగా 10 శాతం వరకూ పెరిగి 6 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా మూడు రెట్లు పెరిగాయి. చివరకు రూ.481 దగ్గర స్టాక్ క్లోజైంది.

ఇన్ఫోసిస్ రిజల్ట్స్

మార్కెట్ ట్రేడింగ్ సమయం తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపధ్యంలో ఈ స్టాక్ ఈ రోజు స్వల్ప లాభాల్లో కొనసాగింది. చివరకు స్టాక్ 1.2 శాతం లాభంతో రూ.730.05 దగ్గర ముగిసింది.

English summary

వీకెండ్‌లో మళ్లీ వణుకు ! నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Sensex falls on fag end selling, down 87 pts: Nifty ends at 11,552

Indian equity benchmarks clocked their worst weekly losses since May 12. The S&P BSE Sensex closed 1.9 percent lower this week at 38,736 and the NSE Nifty 50 closed at 11,552, down 2.2 percent. The broader market index represented by the NSE Nifty 500 Index closed 2.1 percent lower during the period. Today, the 31-share index and the 50-stock gauge closed 0.22 percent lower and 0.26 percent lower respectively.
Story first published: Friday, July 12, 2019, 18:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X