For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 రోజుల నష్టాలకు బ్రేక్ ! ప్రైవేట్ బ్యాంకుల మద్దతుతో గట్టెక్కాయ్

By Chanakya
|

నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసి కొద్దిగా ఇన్వెస్టర్లలో భయాన్ని పోగొట్టాయి. నిఫ్టీ ఈ రోజు మళ్లీ 11600 పాయింట్ల మార్కును టచ్ చేసినట్టే చేసి వెనక్కి వచ్చినప్పటికీ 11550 పాయింట్లపైనే ముగియడం కాస్త ఊరటనిచ్చే అంశం. రోజంతా 70-80 పాయింట్ల రేంజ్‌లోనే కదడాలిన సూచీలు చివరకు పటిష్టంగానే క్లోజయ్యాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో నిఫ్టీ లాభాల బాటలో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన కొన్ని ప్రోత్సాహక సంకేతాలు కూడా దోహదపడ్డాయి. చివరకు సెన్సెక్స్ 267 పాయింట్ల లాభంతో 38824 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 11583 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్ల పెరిగి 30716 దగ్గర క్లోజైంది.

మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, ఆటో స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెక్టోరల్ సూచీలన్నీ లాభాల్లో ముగియడం ప్రధానంగా గమనించాల్సిన మరో అంశం. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు రెండూ అర శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.

Indices snap four days losing streak, Sensex up 267 points

జీ ఎంటర్‌టైన్మెంట్, జీఎస్‌డబ్ల్యు స్టీల్, హీరోమోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ స్టాక్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

మెటల్ స్టాక్స్ గెయిన్
వాణిజ్య యుద్ధ పరిష్కారానికి సంబంధించి అమెరికా - చైనా మధ్య మళ్లీ చర్చలు కొలిక్కిరావొచ్చనే అంచనాలతో మెటల్ స్టాక్స్ మళ్లీ పరుగు తీశాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్ 5 శాతం, జిందాల్ హిసార్ 3.5 శాతం, హిందాల్కో-వేదాంతా 2.7 శాతం పెరిగాయి. మెటల్ ఇండెక్స్‌లో ఎన్ఎండిసి ఒక్కటే 2.5 శాతం నష్టపోయింది.

డిహెచ్ఎఫ్ఎల్ - రిజల్యూషన్ ప్లాన్
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌కు ఇచ్చి రుణాల రికవరీ సహా ప్రస్తుత ఆర్థిక స్థితగతులను అంచనా వేసేందుకు రుణగ్రహీలంతా ఈ రోజు భేటీ అయ్యారు. పరిష్కార ప్రణాళిక నేపధ్యంలో స్టాక్ ఈ రోజు కొద్దిగా రికవర్ అయింది. రూ.69 వరకూ పడిపోయిన స్టాక్ చివరకు కోలుకుని రూ.71.25 దగ్గర క్లోజైంది. 2 శాతం వరకూ లాభపడింది.

ఇండిగో - రికవరీ
ఇద్దరు ప్రమోటర్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరి వ్యవహారం సెబీ దగ్గరకు చేరడం ఈ రోజు కూడా స్టాక్‌ను ఆందోళనకు గురిచేసింది. ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తును మొదలుపెట్టిన నేపధ్యంలో స్టాక్ ఇంట్రాడేలో రూ.1273కి దిగొచ్చింది. చివరకు 7 శాతం వరకూ కోలుకున్నప్పటికీ 3 శాతం నష్టాలతో రూ.1354 దగ్గర క్లోజైంది.

భారత్ ఫోర్జ్‌కు ఆర్డర్ బూస్ట్
భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి రఫేల్‌కు రూ.700 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. నాలుగైదేళ్లలో సుమారు 1000 మిసైల్ కిట్స్ రూపొందించే ఈ ఆర్జర్ నేపధ్యంలో స్టాక్ 5 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.465 దగ్గర క్లోజైంది.

రిలయన్స్ ఇన్ఫ్రాకు బూస్ట్
ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో ఏకంగా స్టాక్ 16 శాతం వరకూ పెరిగింది. బకాయిపడిన రుణానికి 180 రోజుల్లో ఏదో ఒక పరిష్కార మార్గాన్ని వెతకడంతో పాటు ఉన్న ఆస్తులను అమ్మేసేందుకు గడువు కోరారు అనిల్ అంబానీ. ఇందుకోసం 16 మంది రుణదాతలతో ఓ అంతర్గత ఒప్పందానికి వచ్చారు. ఈ నేపధ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ 11 శాతం లాభాలతో రూ.51.05 దగ్గర క్లోజైంది.

ఇన్ఫోసిస్ - రిజల్ట్స్ నేపధ్యంలో ఒడిదుడుకులు
నేడు మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతోంది. మొన్నటి టిసిఎస్ రిజల్ట్స్‌కు తోడు గార్ట్‌నర్ కూడా అంచనాలు తగ్గించడంతో ఇన్ఫోసిస్‌పై ఆ స్థాయిలో నమ్మకాలు లేవు. దీంతో ఇంట్రాడేలో రూ.709కి పడిపోయిన స్టాక్ చివర్లో కొద్దిగా కోలుకుని రూ.722 దగ్గర క్లోజైంది. 0.7 శాతం లాభపడింది.

డెన్ నెట్వర్క్ హై జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్దికాలం క్రితం కొనుగోలు చేసిన డెన్ నెట్వర్క్స్ సంస్థ షేర్ ఈ రోజు లాంగ్ జంప్ చేసింది. ఈ రోజు ఏప్రిల్ - జూన్ ఫలితాలు విడుదల కాబోతున్న నేపధ్యంలో స్టాక్ 15 శాతం పెరిగింది. చివరకు రూ.63.05 దగ్గర క్లోజైంది.

English summary

4 రోజుల నష్టాలకు బ్రేక్ ! ప్రైవేట్ బ్యాంకుల మద్దతుతో గట్టెక్కాయ్ | Indices snap four days losing streak, Sensex up 267 points

After four days of losing streak, the benchmark equity indices on Thursday ended in the positive zone with auto, metal and media sector contributing the most.
Story first published: Thursday, July 11, 2019, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X