For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ దెబ్బకు నాలుగు రోజుల లాభాలు హాంఫట్

By Chanakya
|

నాలుగు రోజుల వరుస లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది. బడ్జెట్ ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్పకూలింది. ప్రసంగం మొదలైన మరింత పతనమైన నిఫ్టీ ఒక దశలో 11800 దిగువకు పడిపోయింది. బడ్జెట్‌లో పెద్దగా మెరుపులేవీ లేకపోవడంతో పాటు సూపర్ రిచ్‌కు అదనపు సర్ ఛార్జీ విధింపు, పెద్దగా ప్రోత్సాహకాలేవీ లేకపోవడం కూడా మార్కెట్లను నిరుత్సాహ పరిచింది. దీంతో ప్రధానంగా ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

బయ్ ఆన్ రూమర్స్.. సెల్ ఆన్ న్యూస్.. అనే నానుడికి తగ్గట్టు.. బడ్జెట్ మొదలైన వెంటనే మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ ఏకంగా 180 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ కూడా 600 పాయింట్ల వరకూ కుప్పకూలింది. చివరకు నిఫ్టీ 136 పాయింట్ల నష్టంతో 11811 దగ్గర, సెన్సెక్స్ 395 పాయింట్ల నష్టంతో 39514 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 31476 దగ్గర ముగిసింది.

Sensex ends 394 points down, Nifty at 11,811 post Union Budget outcome

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, సన్ ఫార్మా షేర్లు లూజర్స్ జాబితాలో నిలిచాయి.

ఎలక్ట్రిక్ కార్లు కొంటే రూ.1.5 లక్ష ప్రయోజనంఎలక్ట్రిక్ కార్లు కొంటే రూ.1.5 లక్ష ప్రయోజనం

డిఫెన్స్‌ స్టాక్స్‌కు దెబ్బ
భారత ఆయుధ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్‌పై ఇంపోర్ట్ డ్యూటీని మినహాయించాలని చూస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశీయ డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ నష్టాల బాటలో నడిచాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 4 శాతం, భారత్ డైనమిక్స్ 5 శాతం, నెల్కో 2.5 శాతం వరకూ నష్టపోయాయి.

సిగరెట్ కంపెనీల్లో జోష్

సిగరెట్లపై నామమాత్రంగా ఎక్సైడ్ డ్యూటీని పెంచబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో కొన్ని పొగాకు ఉత్పత్తి సంస్థల స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. ఎందుకంటే భారీగా పన్నును విధించకుండా నామమాత్రంగా విధించడం ఊరటనిచ్చే అంశం.
ఐటీసీ అర శాతం లాభపడితే, వీఎస్టీ 1 శాతం, గాడ్ ఫ్రే ఫిలిప్స్ రెండు శాతం నష్టపోయాయి. మైక్రోక్యాప్ ట్యాక్ గోల్డెన్ టొబాకో 5 శాతం లాభాల్లో ముగిసింది.

బ్యాటరీ కంపెనీలకూ దెబ్బే

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని, వాటి మౌలిక సదుపాయాలను పెంచడానికి మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలను ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటన దేశీయ బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలకు షాక్ ఇచ్చింది.
అమర రాజా, ఎక్సైడ్ ట్యాక్స్ రెండు శాతం వరకూ నష్టపోయాయి.

వామ్మో యెస్ బ్యాంక్‌లో ఏం జరుగుతోంది

వరుసగా నాలుగో రోజు కూడా యెస్ బ్యాంక్ స్టాక్ నష్టాల్లో ముగిసి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినప్పటికీ స్టాక్ ఈ రోజు కూడా 9 శాతం వరకూ పతనమైంది. రూ. 90 దిగువకు వచ్చిన స్టాక్ రూ.88 దగ్గర క్లోజైంది.

గోల్డ్ డ్రాప్

బంగారంపై ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీని రెండున్నర శాతం చొప్పున పెంచడంతో జ్యువెల్రీ స్టాక్స్‌లో అమ్మకాలు ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. తంగమాయిల్ జ్యువెలర్స్ 9 శాతం పతనమైంది. పిసి జ్యువెలర్స్ 5 శాతం కోల్పోగా, టైటన్ 1 శాతం వరకూ దిగొచ్చింది.

English summary

బడ్జెట్ దెబ్బకు నాలుగు రోజుల లాభాలు హాంఫట్ | Sensex ends 394 points down, Nifty at 11,811 post Union Budget outcome

Sensex and Nifty closed on a negative note, as market participants turned cautious post the outcome of Union Budget 2019 amid globally weakened markets.
Story first published: Friday, July 5, 2019, 18:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X