For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో రోజూ లాభాల్లోనే ముగింపు ! ఈ రోజు ఐటీ స్టాక్స్ అండ

By Chanakya
|

రెండో రోజు కూడా లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి స్టాక్ మార్కెట్లు. బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో నిఫ్టీ 11900 పాయింట్ల మార్కును అధిగమించింది. వర్షపాతం మెరుగవడం కూడా కలిసొచ్చింది. అయితే ఆద్యంతం ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు పాజిటివ్‌గానే ముగిసింది. 11890 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ఒక దశలో 11917 వరకూ వెళ్లింది. అయితే మిడ్ సెషన్ తర్వాత 11815 వరకూ వెళ్లిన నిఫ్టీ ఆఖర్లో కోలుకుంది. చివరకు 130 పాయింట్ల లాభంతో 39816 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 11910 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 89 పాయింట్లు నష్టపోయి 31283 దగ్గర ఆగింది.

నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అర శాతం లాభపడితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్‌గా స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇక ఎలక్టోరల్ ఇండిసిస్ పరంగా చూస్తే రియాల్టీ, ప్రైవేట్ - ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా, మీడియా రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది. ఐటీ, ఎఫ్ఎంసిజి, పైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లు కాస్త కుదుటపడ్డాయి.

Sensex ends 130 pts higher, Nifty tops 11,900

యూపీఎల్, ఓఎన్జీసీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

అదానీ పవర్ మళ్లీ జంప్
ముంద్రా ప్లాంట్‌కు సంబంధించి గత సంవత్సరాల బకాయిల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం కోర్ట్ సూచించింది. ఇందుకు సంబంధించిన టారిఫ్‌లను సీఈఆర్‌సీ ఖరారు చేస్తుందని సుప్రీం తీర్పుచెప్పింది. ఈ నేపధ్యంలో అదానీ పవర్ స్టాక్ మళ్లీ లాభపడింది. ఈ రోజు 8 శాతం పెరిగి రూ.65 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ కూడా ఎగిరి గంతేసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 17 రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ 15 శాతం పెరిగి రూ.52.15 దగ్గర ముగిసింది.

మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!

డిఎల్ఎఫ్‌.. రెండు నెలల తర్వాత

వరుసగా ఆరు సెషన్ల పాటు లాభపడి కొద్దిగా ఆశలు చిగురింపజేస్తోంది డిఎల్ఎఫ్ స్టాక్. రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే వరుస లాభాల్లో కొనసాగుతోంది స్టాక్. యావరేజ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. చివరకు స్టాక్ 1.15 శాతం పెరిగి రూ.193 దగ్గర క్లోజైంది.

యెస్ బ్యాంక్ మళ్లీ ఢమాల్
ముంబైకి చెందిన రేడియస్ డెవలపర్స్ రూ.1200 కోట్ల రుణంపై వడ్డీని డిఫాల్ట్ చేసిందనే వార్తలు రుణదాతైన యెస్ బ్యాంక్ స్టాక్‌ను పడేసింది. అయితే దీనిపై రేడియస్ మాత్రం భిన్నంగా స్పందించింది. తాము మూడు రోజుల క్రితమే డబ్బులు చెల్లించేసినట్టు చెప్పింది. అయినా స్టాక్ మాత్రం 8 శాతం నష్టపోయి రూ.101 దగ్గర క్లోజైంది.

ఇక్రాకు సీఈఓ దెబ్బ
సీఈఓ నరేష్ టక్కర్‌ను యాజమాన్యం బలవంతంగా సెలవుపై పంపించిన నేపధ్యంలో ఇక్రా స్టాక్ కుప్పకూలింది. కొన్ని ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపధ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం స్టాక్‌ను 5 శాతం పడేసింది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ నష్టాల్లో ముగిసింది. ఈ రోజు కూడా 5 శాతం పతనమై రూ.3050 దగ్గర క్లోజైంది.

ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్ ఎఫెక్ట్
వివిధ స్టాక్స్‌లో ఒడిదుడుకులకు కళ్లెం వేసేందుకు ఎక్స్ఛేంజీలు అడిషనల్ సర్వైలెన్స్ మెషర్స్‌ ఫ్రేమ్ వర్క్‌లోకి తీసుకువచ్చింది. దీంతో జిందాల్ వాల్డ్ వైడ్, జెబిఎఫ్ ఇండస్ట్రీస్, శ్రేయీ ఇన్ఫ్రా, పటేల్ ఇంజనీరింగ్, పోకర్న, ఎస్సార్ షిప్పింగ్, ఎస్ చాంద్ కంపెనీల్లో ఈ రోజు ఒత్తిడి నమోదైంది.

English summary

రెండో రోజూ లాభాల్లోనే ముగింపు ! ఈ రోజు ఐటీ స్టాక్స్ అండ | Sensex ends 130 pts higher, Nifty tops 11,900

The S&P BSE Sensex ended 130 points, or 0.30 per cent, higher at 39,816 levels with ONGC, HDFC and Bharti Airtel being the top gainers. The broader Nifty50 too settled with gains of 45 points, or 0.38 per cent, at 11,910 levels.
Story first published: Tuesday, July 2, 2019, 17:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X