ముంబై: రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. కనీసం కొంతలోనైనా కొంత గట్టెక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముంబైలోని తన ప్రధాన కార్యాలయంను లీజుకు కానీ పూర్తిగా అమ్మివేసేందుకు గానీ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తన కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల తాను ఈ హెడ్‌క్వార్టర్స్‌ను అమ్మకానికి పెట్టి తద్వారా కొంత రుణాలను తీర్చాలని భావిస్తున్నారు.
ఒక వేళ అనిల్ అంబానీ తన ప్రధాన కార్యాలయంను అమ్మాలని డిసైడ్ అయితే తాను దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి మారిపోవచ్చని తెలుస్తోంది.2005లో తన సోదరడు ముఖేష్ అంబానీతో విడిపోయి ఆస్తుల పంపకాలు జరిగిన క్రమంలో అనిల్ అంబానీకి బల్లార్డ్ ఎస్టేట్ రావడం జరిగింది. ప్రస్తుతం ముంబై హెడ్‌క్వార్టర్స్‌లో ఏడు లక్షల చదరపు అడుగులు ఉన్న కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజ్ కింద కానీ , పూర్తిగా అమ్మాలనే ఆలోచనలో అనిల్ అంబానీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్యాలయం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉంది. దీన్ని అమ్మడం కానీ లీజుకు ఇవ్వడం కానీ చేసి అప్పుల్లో ఉన్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను గట్టెక్కించాలనే యోచనలో అంబానీ ఉన్నట్లు సమాచారం.

గత కొన్నేళ్లుగా అనిల్ అంబానీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారు. ఆయన్ను వెంటాడని కష్టం అంటూ లేదు. ప్రస్తుతం అనిల్ ధీరూభాయ్ అంబానీ సంస్థలన్నీ అప్పుల ఊబిలో పేరుకుపోయాయి. అయితే ఈ మధ్యే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ కేసులో జైలు శిక్ష నుంచి తృటిలో తప్పించుకున్నారు అనిల్ అంబానీ. ఎరిక్‌సన్‌కు బకాయి పడ్డ డబ్బులను చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే తన సోదరుడు ముఖేష్ అంబానీ ఆదుకుని ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడంతో జైలు గండం నుంచి అనిల్ బయటపడ్డారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications