For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లో ప్రీ బడ్జెట్ ర్యాలీ, 11800 దాటిన నిఫ్టీ

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు ఎగిరి గంతేశాయి. వారం ప్రారంభంలో నీరసంగా మొదలైన సూచీలు ఈ రోజు రెట్టించిన ఉత్సాహంతో ఎగసి మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబర్చాయి. నిఫ్టీ 11800 పాయింట్ల మార్కును కూడా అధగిమించి ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన నిఫ్టీ మిడ్ సెషన్ వరకూ ఒక 50 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి సుమారు 150 పాయింట్లు ఎగసింది. బడ్జెట్ సమీపిస్తుండడం, వివిధ రాష్ట్రాల్లో వర్షాలు కురవడం వంటివి కలిసొచ్చాయి. చివరకు నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 11796 దగ్గర, సెన్సెక్స్ 312 పాయింట్లు పెరిగి 39435 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా నష్టాల నుంచి తేరుకుని 245 పాయింట్లు పెరిగి 30847 దగ్గర క్లోజైంది. మార్కెట్లు ఈ స్థాయిలో లాభపడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 3 శాతం లాభం కూడా దోహదపడింది.

జెఎస్‌డబ్ల్యు స్టీల్, బిపిసిఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో స్థానం పొందాయి.

Nifty ends near 11,800, Sensex up 312 points

హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి రికార్డ్ రన్
వరుసగా నాలుగో సెషన్‌లో కూడా లాభాల్లో ముగిసింది హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి స్టాక్. గతవారం డిబెంచర్ల కొనుగోలు నేపధ్యంలో అనూహ్యంగా పడిన స్టాక్ అప్పటి నుంచి అంతే వేగంతో తేరుకుంది. ఆల్ టైం గరిష్ట స్థాయిలకు చేరువైన స్టాక్ ఈ రోజు రూ.1938 దగ్గర క్లోజైంది.

మళ్లీ అనిల్ స్టాక్స్‌లో నష్టాలు
ప్రత్యేకించి కారణం చెప్పడం కష్టం కానీ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌లో మళ్లీ పతనం మొదలైంది. రిలయన్స్ పవర్ 13 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 10 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 7 శాతం నష్టపోయాయి.

బ్లాక్ డీల్స్, ఓఎఫ్ఎస్ ఎఫెక్ట్
వివిధ కారణాలతో ఐసిఐసిఐ లాంబర్డ్ స్టాక్ ఈ రోజు ఏకంగా 7 శాతం వరకూ పతనమైంది. సుమారు 3 శాతం ఈక్విటీ బ్లాక్ డీల్స్ రూపంలో చేతులు మారింది. ట్రేడింగ్ వాల్యూమ్ 20 రెట్లుపెరిగింది. చివరకు స్టాక్ 6.5 శాతం నష్టపోయి రూ.1102 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో ఎస్బీఐ లైఫ్ కూడా భారీగా పతనమైంది. ఎస్బీఐ లైఫ్‌లో వాటా ఉన్న బిఎన్‌పి పరిబాస్ కార్డిఫ్ తన వాటాను అమ్మింది. మార్కెట్‌ ప్రైస్‌తో పోలిస్తే 8.5 శాతం డిస్కౌంట్‌కు అమ్మడంతో స్టాక్ 5 శాతం క్షీణించింది. చివరకు రూ. 675 దగ్గర క్లోజైంది.

టైర్ స్టాక్స్
చైనా నుంచి దిగుమతి అయ్యే రేడియల్ టైర్లపై కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని కేంద్రం విధించింది. దీంతో దేశీయంగా ఉన్న టైర్ కంపెనీల స్టాక్స్ లాభపడ్డాయి. ప్రధానంగా సియట్ 5 సాతం, బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్ 3 శాతం, జెకె టైర్స్ 4 శాతం పెరిగాయి. ఎంఆర్ఎఫ్, అపోలో, టీవీఎస్ శ్రీచక్ర కూడా ఒకటి నుంచి మూడు శాతంవరకూ పెరిగాయి.

పిరమల్‌ మళ్లీ మొదటికి
శ్రీరాం క్యాపిటల్‌లో తనకు ఉన్న 20 శాతం వాటాను అమ్మాలని పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నిర్ణయించుకుంది. ఎన్ బి ఎఫ్ సికి నిధుల సమీకరణ కోసం చూస్తున్న యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని నెగిటివ్‌గా తీసుకున్న స్టాక్ 3 శాతం నష్టపోయింది. చివరకు రూ.1887 దగ్గర క్లోజైంది.

క్రూడ్ కూల్.. ఓఎంసి గెయిన్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు కాస్త చల్లారడం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొద్దిగా కలిసొచ్చింది. బ్రెంట్ క్రూడ్ రెండో రోజు కూడా ఒక్క శాతం వరకూ తగ్గింది. దీంతో బిపిసిఎల్, హెచ్ పి సి ఎల్ రెండున్నర శాతం వరకూ పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటిన్నర శాతం పెరిగింది.

ఇమామీ నష్టాలకు బ్రేక్
నష్టాలను తగ్గించుకునేందుకు నిన్న ప్రమోటర్లు సుమారు 10 శాతం వాటాను అమ్మిన నేపధ్యంలో మార్కెట్లో నిన్న ఒక్కసారిగా భారీ పతనం నమోదైంది. అయినప్పటికీ గత పది రోజుల నుంచి నీరసంగానే ఉన్న స్టాక్‌లో ఈ రోజు తెరిపిచ్చింది. స్టాక్ 10 శాతం వరకూ పెరిగి నాలుగు నెలల గరిష్టానికి చేరింది. చివరకు 9శాతం లాభంతో రూ.291 దగ్గర క్లోజైంది.

English summary

మార్కెట్లో ప్రీ బడ్జెట్ ర్యాలీ, 11800 దాటిన నిఫ్టీ | Nifty ends near 11,800, Sensex up 312 points

the Sensex was up 311.98 points at 39,434.94, while Nifty was up 96.80 points 11,796.50. About 1233 shares have advanced, 1268 shares declined, and 166 shares are unchanged.
Story first published: Tuesday, June 25, 2019, 20:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X