For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్‌లో నష్టాల పార్టీ ! నిన్న పెరిగిదంతా.. ఊడ్చేశారు

By Chanakya
|

వారాంతంలో స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ దిగాలుపడ్డాయి. నిన్న పెరిగి కాస్త ఊరటనిచ్చాయని భావించే లోపే భారీగా పతనమయ్యాయి. నిన్నటి లాభాలన్నీ ఈ రోజు దాదాపుగా ఆవిరైపోవడం మళ్లీ ఆందోళన కలిగించే విషయం. కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ అర శాతానికిపైగానే తగ్గాయి. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్నప్పటికీ మిడ్ సెషన్ తర్వాత సెల్లింగ్ ప్రెషర్ అత్యధికమైంది. ఆఖరి అరగంటలో ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ చివరకు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 39,195 దగ్గర, నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 11724 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 152 మాత్రమే కోల్పోయి 30628 దగ్గర క్లోజైంది.

యూపీఎల్, టెక్ మహీంద్రా, ఇండియాబుల్స్ హౌసింగ్, హిందాల్కో, ఎస్బీఐ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, మారుతి సుజుకి, హెచ్ డి ఎఫ్ సి, కోల్ ఇండియా, హీరోమోటో కార్ప్ లూజర్స్ జాబితాలో చేరాయి.

Sensex ends 407 pts lower, Nifty below 11,724

జెట్ ఫైట్ మామూలుగా లేదు
జెట్ ఎయిర్వేస్ స్టాక్ నిన్న, ఈ రోజూ ట్రేడర్లకు చుక్కలు చూపించారు. ఒకే రోజు ఏకంగా 100 శాతానికి పైగా ఒడిదుడుకులు ఎవరికీ అంతుచిక్కలేదు. ఇంట్రాలేడో రూ. 39.10 కనిష్టానికి పడిపోయిన జెట్.. మళ్లీ అదే వేగంగా కోలుకుని రూ.80 దాకా వెళ్లింది. స్పాట్ ప్రైస్‌కి.. ఫ్యూచర్స్ ప్రైస్‌కీ కూడా ఒక దశలో రూ.20 వరకూ తేడా నమోదైంది. చివరకు స్టాక్ స్పాట్‌లో రూ.72.45 దగ్గర క్లోజైంది.

హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి కోలుకుంది
ఈ వారం ప్రారంభంలో భారీగా పతనమైన హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి మళ్ల కాస్త కోలుకుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రిస్కీగా ఉన్న సుమారు రూ.500 కోట్ల విలువైన ఎన్.సి.డిలను కంపెనీ కోనుగోలు నష్టాలకు కారణమైంది. అయితే కాస్త తేరుకున్న స్టాక్ ఈ రోజు 3 శాతం వరకూ పెరిగింది. రూ.1874 దగ్గర క్లోజైంది.

గ్రాఫైట్ స్టాక్స్‌లో జోష్
తర్జాతీయ మార్కెట్లో గ్రాఫైట్ ధరల్లో వృద్ధి ఈ స్టాక్స్‌ను లాభాల్లోకి తీసుకెళ్లింది. హెచ్ఈజీ - ఈసాబ్ 7 శాతం వరకూ లాభపడ్డాయి. కానీ గ్రాఫైట్ ఇండియా మాత్రం 7 శాతం నష్టపోయి రూ.341 దగ్గర క్లోజైంది. భారీ వాల్యూమ్స్‌తో సహా స్టాక్ పతనం కావడం గమనించాల్సిన అంశం.

యెస్ బ్యాంక్.. మళ్లీ అంతే
నిన్న కాస్త తేరుకున్నట్టు కనిపించిన యెస్ బ్యాంక్ స్టాక్ ఈ రోజు అదే స్థాయిలో పతనమైంది. ఏకంగా 5 శాతం వరకూ నష్టపోయింది. చివరకు రూ.110 దగ్గర ముగిసింది. ఇదే బాటలో అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, క్యాడిలా హెల్త్ కూడా 3 శాతానికి పైగా నష్టపోయాయి.

మీ ఇంటి ఈఎంఐ వడ్డీ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు తెలుసా?మీ ఇంటి ఈఎంఐ వడ్డీ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు తెలుసా?

English summary

వీకెండ్‌లో నష్టాల పార్టీ ! నిన్న పెరిగిదంతా.. ఊడ్చేశారు | Sensex ends 407 pts lower, Nifty below 11,724

Sensex ends 407 pts lower, Nifty below 11,724
Story first published: Friday, June 21, 2019, 18:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X