For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ ప్రయాణ బీమా తీసుకుంటే లాభమేగా...

By Jai
|

విదేశాలకు తరచూ ప్రయాణించేవారు లేదా అప్పుడప్పుడు ప్రయాణం చేసేవారు, కుటుంబంతో సహా వెళ్లేవారు అనేక మంది ఉంటారు. కొంత మంది వ్యాపార నిమిత్తం, మరికొంత మంది హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి లేదా ఏదైనా ఇతర పనులకోసం వెళతారు. అయితే వీరిలో చాలా మంది ప్రయాణ బీమా తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు. తమకు కొత్తకాదుగా అని కొందరు, బీమా కోసం అనవసరంగా డబ్బులు ఎందుకు అని మరి కొందరు ప్రయాణ బీమాను నిర్లక్ష్యం చేస్తుంటారు.
వీరు తాము వెళ్లే ప్రదేశంలో ఉండే దర్శనీయ ప్రాంతాలు, ఇతర అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఎంతో ముఖ్యమైన ప్రయాణ బీమాను పట్టించుకోరు. ఈ బీమాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోకపోవడం వల్ల ఉండే నష్ఠాల గురించి చూద్దాం..

వేటికి కవరేజీ లభిస్తుందంటే...
అంతర్జాతీయ ప్రయాణాల్లో మనం ఊహించనిది ఏదైనా జరగవచ్చు. అలాంటి సమయంలో నష్టపోయేది బీమా తీసుకొని వారే. ఒక వేళ బీమా తీసుకుని ఉంటే వేటికి కవరేజీ లభిస్తుందో చుద్దాం..

Is travel tour insurance is better?

- ప్రయాణాల సమయంలో లగేజీ తీసుకువెళ్లడం తప్పని సరి. ఈ లగేజీ కొన్నిసార్లు దురదృష్ట వశాత్తు గల్లంతు కావచ్చు. అందులో ఏమైనా విలువైనవి ఉండవచ్చు. గల్లంతయిన లగేజీని మీరు వెతికి పట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి దానిపై ఆశలు వదులుకోవాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో బీమా ఉండి ఉంటే దానికి తగిన కవరేజీ లభిస్తుంది.
- ప్రయాణ పత్రాలు కోల్పోయినా, సొంత వస్తువులు పోగొట్టుకున్నా బీమా రక్షణ ఉంటుంది.
- ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా..
- మీ బ్యాగేజీ రావడంలో జాప్యం జరిగినా..
- మీ ప్రయాణం రద్దయినా లేదా ఏవైనా అవాంతరాలు ఎదురైనా పరిహారం పొందవచ్చు.
- అంతేకాకుండా జబ్బుపడి ఆస్పత్రిలో చేరితే నగదు రహిత కవరేజీ పొందవచ్చు.
- పాస్ పోర్ట్ కోల్పోయినా, కనెక్షన్ ఫ్లైట్ ను అందుకోలేక పోయినా కవరేజ్ లభిస్తుంది.
- ఇంట్లో దొంగతనాలు జరిగినా..
- అత్యవసరంగా ఉన్న ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినా ..

వేటికి వర్తించదు...
- ఇప్పటికే మీకు ఏదైనా అనారోగ్యం ఉంది ఉంటే. దాని గురించి ముందుగానే వెల్లడించినా దానికి కవరేజ్ లభించదు.

- ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు పడిన వారికీ కూడా

ఏ పాలసీ ఎంచుకోవాలి..
- తరచుగా విదేశీ ప్రయాణాలు చేయక పోతే సింగిల్ ట్రిప్ ట్రావెల్ బీమా తీసుకోవడం మంచిది. ఈ బీమా తీసుకునే సమయంలోనే మీ ప్రయాణ కాలపరిమితి తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.

- సింగిల్ ట్రిప్ ప్రయాణ పాలసీని 10-15 నిమిషాల వ్యవధిలోనే ఆన్ లైన్ ద్వారా బీమా కంపనీల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ బీమా పాలసీ సాఫ్ట్ కాపీని వెంటనే పొందవచ్చు. బీమా హార్డ్ కాపీ మీ అడ్రెస్ కు రావడానికి గరిష్టంగా 15 రోజులు పట్టవచ్చు.
- అవసరం లేదనుకుంటే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఇందుకు కొంత చార్జీని బీమా కంపనీలు వసూలు చేస్తాయి.
- బీమా తీసుకునే ముందే అందులోని నిభందనలు, కవరేజికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా చదవాలి.
- మీ ప్రయాణం ప్రారంభించిన లేదా బీమా ప్రారంభ తేదీ నుంచి కవరేజ్ మొదలవుతుంది.
- ఆన్ లైన్లో పాలసీ కొనుగోలు చేసినప్పుడు బీమా ప్రీమియం మొత్తాన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
- ఎక్కువ సార్లు ప్రయాణం చేసేవాళ్ళు అందుకు తగిన బీమాను ఎంచుకోవచ్చు.
- నిర్దేశిత కాలానికి బీమా తీసుకుని అంతకన్నా ఎక్కువ రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తే పాలసీ గడువును పెంచుకునే సదుపాయం ఉంటుంది.
- పాలసీ తీసుకునే ముందు మీ వయసు, ఎంతకాలానికి ప్రయాణం చేస్తున్నారు, ఎప్పుడు బయలు దేరుతున్నారు వంటి వివరాలతో పాటు మీ మొబైల్ నెంబర్, ఈ- మెయిల్ ఐడి ని తెలియజేయాల్సి ఉంటుంది.
- ఇక బీమా తీసుకునే ముందు వివిధ బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్రీమియంల గురించి తెలుసుకోండి. దేనికి బీమా వర్తించదో కూడా తెలుసుకోవాలి.

సీనియర్ సిటిజన్లకు భరోసా ఈ పథకంసీనియర్ సిటిజన్లకు భరోసా ఈ పథకం

English summary

విదేశీ ప్రయాణ బీమా తీసుకుంటే లాభమేగా... | Is travel tour insurance is better?

Travel insurance is insurance coverage for risks associated with traveling such as loss of luggage, delays, and death or injury while in a foreign country.
Story first published: Thursday, June 20, 2019, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X