For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ ! స్వల్ప లాభల్లో ముగిసినా భయం..భయం

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఎట్టకేలకు కుదుటపడ్డాయి. భారీ నష్టాల తర్వాత ఈ రోజు కాస్త స్థిమితపడ్డ నిఫ్టీ 11700 పాయింట్ల దిగువనే ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫరవాలేదనిపించే పనితీరును కనబర్చింది. ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ట్విన్స్ వంటి స్టాక్స్ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. మారుతి, సన్ ఫార్మా, హెచ్ డి ఎఫ్ సి ట్విన్స్ మార్కెట్లను వెనక్కి లాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతో 11677 పాయింట్ల దగ్గర మొదలైన నిఫ్టీ ప్రారంభంలో నిలదొక్కుకోలేకపోయింది. చివరకు 20 పాయింట్ల లాభంతో 11691 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ 86 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో ముగిశాయి.

వేదాంతా, కోల్ ఇండియా, బిపిసిఎల్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్, మారుతి సుజుకి, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ నష్టాల జాబితాలో చేరాయి.

Sensex snaps 4 day losing run: rises 78 pts, Nifty at 11,691

వాస్తవానికి ఇండెక్స్ లాభాల్లో ముగిసినప్పటికీ అధిక శాతం సెక్టార్స్ నష్టాల బాట పట్టాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ ఫ్లాట్‌గా ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసిజి, మీడియా, ఫార్మా రంగ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా నమోదైంది. ఐటీ, మెటల్ మాత్రమే కాస్త ఫరవాలేదనిపించాయి.

జెట్ క్రాష్
జెట్ ఎయిర్వేస్‌పై ఎస్బీఐ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లబోతున్నట్టు వచ్చిన వార్తలు స్టాక్‌ను కుప్పకూల్చాయి. కంపెనీని దివాలా గుర్తించి ముందుకు సాగేందుకు అనుమతినివ్వాంటూ ప్రధాన లెండర్ ఎస్బీఐ ఎన్.సిఎల్.టిని ఆశ్రయించబోతోంది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 50 శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో రూ.32 వరకూ దిగొచ్చిన స్టాక్ కాస్త కోలుకుని రూ.40.50 దగ్గర క్లోజైంది 40 శాతం నష్టంతో. అది కూడా ఒక్క రోజులోనే.

మరోవైపు ఇదే రంగానికి చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పెద్ద ఎత్తున కొత్త ఎయిర్‌బస్‌ విమానాలను ఆర్డర్ చేసింది. ఈ డీల్ విలువ సుమారు 20 బిలయన్ డాలర్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. ఈ వార్తల నేపధ్యంలో ఇండిగో స్టాక్ రెండున్నర శాతం లాభపడింది. చివరకు రూ. 1670 దగ్గర క్లోజైంది.

హెచ్ డి ఎఫ్ ఎసి ఏఎంసి మొదటి దెబ్బ
లిస్ట్ అయినప్పటి నుంచి హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి స్టాక్ ఈ స్థాయిలో పతనాన్ని చూడలేదు. ఎఫ్ఎంపి ఇన్వెస్టర్లను కాపాడేందుకు ఎస్సెల్ గ్రూపునకు చెందిన రూ.500 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను సంస్థ కొనుగోలు చేసింది. ఒక వేళ నష్టం వస్తే అది తాను భరించేందుకు సిద్ధమైన నేపధ్యంలో స్టాక్ కుప్పకూలింది. ఒకే రోజు ఏకంగా 7 శాతం వరకూ దిగొచ్చింది. చివరకు రూ.1807 దగ్గర క్లోజైంది.

యెస్ బ్యాంక్ మళ్లీ అంతే..
నిన్న కాస్త తేరుకున్నట్టు కనిపించిన యెస్ బ్యాంక్ షేర్‌లో ఈ రోజు మళ్లీ అదే దుస్థితి. స్టాక్ మరో 6 శాతం కోల్పోయి రూ.109.30 దగ్గర ముగిసింది.
ఇదే బాటలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 7 శాతం, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ కూడా 7 శాతం నష్టపోయింది.

అనిల్ అంబానీ.. ఇంకేం మిగిలింది
అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌ నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. ఒకప్పుడు టాప్ బిలయనీర్ల జాబితాలో టాప్ స్థానంలో ఉన్న అనిల్ ఇప్పుడు ఆ జాబితా నుంచే వైదొలిగారు. అంటే తన సంస్థల నెట్వర్త్ కనీసం రూ.7000 కోట్లు కూడా లేవనేది అర్థం. ఈ రోజు కూడా రిలయన్స్ ఇన్ఫ్రా 19 శాతం, రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 11 శాతం నష్టపోయాయి. యాడ్లాబ్స్ 20 శాతం, రిలయన్స్ డిఫెన్స్ 18 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 10 శాతం కుప్పకూలాయి.

స్టార్ సిమెంట్స్‌కు బైబ్యాక్ కిక్
జూన్ 21వ తేదీన సమావేశం కాబోతున్న బోర్డు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలతో స్టార్ సిమెంట్స్ స్టాక్స్ లాభాల బాటలో పరుగులు తీసింది. ఇంట్రాడేలో 12 శాతం వరకూ పెరిగిన స్టాక్ రూ.132 వరకూ చేరింది. అయితే వెంటనే లాభాల స్వీకరణ కూడా రావడంతో స్టాక్ కేవలం 2 శాతం లాభాలకే పరిమితమైంది. చివరకు రూ.119 దగ్గర క్లోజైంది.

English summary

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ ! స్వల్ప లాభల్లో ముగిసినా భయం..భయం | Sensex snaps 4 day losing run: rises 78 pts, Nifty at 11,691

Shares of Jet Airways dropped as much as 50 per cent in Tuesday's session after the airline's lenders decided to take it to bankruptcy courts.
Story first published: Tuesday, June 18, 2019, 17:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X