For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగో రోజూ నష్టాలే! ఇన్వెస్టర్లలో టెన్షన్ టెన్షన్

By Chanakya
|

నాలుగో రోజూ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాట పట్టి ఇన్వెస్టర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమవుతోంది. 12100 పాయింట్ల నుంచి నిఫ్టీ ఇప్పటివరకూ సుమారు 400 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో 11700 పాయింట్ల మార్కును కూడా నిలబెట్టుకోలేకపోయిన నిఫ్టీ నానాటికీ బలహీనపడ్తోంది. మెటల్ స్టాక్స్‌లో బలహీనత, వర్షాభావ పరిస్థితులు మార్కెట్లను కూలదోశాయి. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌లో పతనం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో గందరగోళం, ఈ మధ్య బాగా పెరిగిన హెవీ వెయిట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ మార్కెట్లకు కిందికి లాగుతోంది. దీంతో సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి 38961 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 151 పాయింట్లు దిగొచ్చి 11672 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్లు తగ్గి 30275 వద్ధ ఆగింది.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.

ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ సెక్టోరల్ ఇండెక్సులు ఏకంగా ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. మెటల్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్ రంగ స్టాక్స్‌లో కూడా సెల్లింగ్ ప్రెషర్ స్పష్టంగా నమోదైంది.

Nifty ends below 11,700, Sensex falls 491 points

మెటల్స్ కరిగాయి !

మెటల్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. అంతకుముందు వారాలు ఈ రంగ సూచీల్లో కొనుగోళ్ల మద్దతు బాగా లభించి స్టాక్స్ బాగా పెరిగాయి. ఈ పతనంలో మరింత భారీగా ఈ మెటల్ సంబంధ స్టాక్స్ పడ్తున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 3 శాతం పతనమైంది. టాటా స్టీల్, జిందాల్ స్టీల్స్ 6 శాతం వరకూ పతనమైతే, సెయిల్ - జెఎస్‌డబ్ల్యు స్టీల్, వేదాంతా వంటి స్టాక్స్ 4 నుంచి 5 శాతం వరకూ పడ్డాయి.

శ్రీరాంట్రాన్స్‌పోర్ట్ - పిరమల్ డౌన్

చెన్నై కేంద్రంగా నడుస్తున్న శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌లో తనకు ఉన్న మొత్తం 9.9 శాతం వాటాను రూ.2305 కోట్లకు (ఒక్కో షేర్ రూ.1020 చొప్పున) అమ్మేసింది పిరమల్ సంస్థ. ఆరేళ్ల క్రితం ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన పిరమల్.. ఈ డీల్ ద్వారా సుమారు 40 శాతం వరకూ లాభాలను ఆర్జించింది.
ఇవే కాకుండా శ్రీరాం క్యాపిటల్, శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్‌లో కూడా పిరమల్‌కు వాటాలున్నాయి. వీటి విలువ సుమారు రూ.9000 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ అంచనా.
ఈ వాటాల అమ్మకం నేపధ్యంలో శ్రీరాం- పిరమల్ స్టాక్స్ రెండూ పతనమయ్యాయి. శ్రీరాంట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ 6.5 శాతం నష్టంతో రూ.1018 దగ్గర క్లోజైంది. ఇదే సమయంలో పిరమల్ స్టాక్ 3.5 శాతం నష్టంతో రూ.2002 దగ్గర స్థిరపడింది.

బోనస్ ఇచ్చినా నష్టాలే

పెప్సికీ అధీకృత ఇండియన్ తయారీ సంస్థ వరుణ్ బెవరేజెస్ స్టాక్ ఈ రోజు భారీగా పడింది. ఈ రోజు భేటీ అయిన బోర్డు.. బోనస్ ఇచ్చేందుకు ఓకె చెప్పింది. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కావడంతో ఇలాంటి ప్రకటన రావొచ్చని మార్కెట్ ముందే ఊహించింది. అయినప్పటికీ స్టాక్ ఈ రోజు కుప్పకూలింది. ప్రారంభంలో రూ.936 వరకూ ఉన్న స్టాక్ ఇంట్రాడేలో రూ.792 వరకూ దిగొచ్చింది. చివరకు 8 శాతం నష్టపోయి రూ.858 దగ్గర క్లోజైంది.

జెట్.. భారీ పతనం

జెట్ ఎయిర్ స్టాక్ పతనం అంచున నిలబడి ఉంది. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుంది దిక్కుతోచని స్థితి. కొత్త ఇన్వెస్టర్ పై స్పష్టత లేకపోవడంతో స్టాక్ ఈ రోజు మరో 20 శాతం వరకూ పతనమైంది. చివరకు 17 శాతం పడిపోయి రూ.68.30 దగ్గర క్లోజైంది.
ఇదే రంగానికి చెందిన స్పైస్ జెట్ కూడా ఈ రోజు 4 శాతం వరకూ దిగొచ్చింది. చివరకు రూ.133.60 దగ్గర క్లోజైంది.

మిడ్ క్యాప్ మంటలు

మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నానాటికీ తీవ్రమవుతోంది. ఈ రోజు 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్స్‌ జాబితా ఏకంగా 275కి చేరింది. ఈ లిస్ట్‌లో అమరరాజా, అతుల్ ఆటో, బేయర్ క్రాప్, భారత్ ఫోర్జ్, సైయెంట్, డిహెచ్ఎఫ్ఎల్, ఇమామీ, హెచ్ఐఎల్, హెచ్ఈజీ, ఐఎఫ్‌బి ఆగ్రో, ఖాదిమ్స్, లక్ష్మీ మెషీన్ వర్క్స్, సికాల్, థెమిస్ మెడీ, టీవీఎస్ శ్రీచక్ర వంటి స్టాక్స్ ఉన్నాయి.

అడాగ్.. ఇక అంతే

అనిల్ ధీరూభాయ్ గ్రూపునకు చెందిన వివిధ స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి. అప్పులు కట్టేందుకు నిధులు లేకపోవడంతో గ్రూప్ స్టాక్స్ అన్నింటి స్థితీ అలానే ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్3 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 6 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 4 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 9 శాతం, రిలయన్స్ నావెల్ 4 శాతం పడ్డాయి.

English summary

నాలుగో రోజూ నష్టాలే! ఇన్వెస్టర్లలో టెన్షన్ టెన్షన్ | Nifty ends below 11,700, Sensex falls 491 points

Indian indices witnessed sharp fall on June 17 on the back of trade war fears which pulled the Sensex below 39,000 and Nifty below 11,700 level.
Story first published: Monday, June 17, 2019, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X