For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

52 వారాల గరిష్టానికి యస్ బ్యాంక్ షేర్లు, ఇండియా టాప్ 10 లిస్ట్ నుంచి ఔట్!

|

వరుసగా బ్యాంకుల షేర్లు పడిపోతున్నాయి. గురువారం రోజు యస్ బ్యాంక్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. గురువారం 12 శాతం పడిపోయాయి. బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ షేరు టార్గెట్ ధరలో కోత విధించిన ప్రభావం కనిపించింది. యస్ బ్యాంకుతో పాటు జెట్ ఎయిర్వేస్ షేరు కూడా 16 శాతం పడిపోయింది. స్టాక్ ఎక్స్‌చేంజ్ ఈ సంస్థకు కఠిన నిబంధనలను విధించడంతో షేర్ల విలువ భారీగా పతనమైంది. ఇండియా బుల్స్ హౌసింగ్‌ ఫినాన్స్ షేరు విలువ సైతం ఆరు శాతం తగ్గింది.

జియో టవర్స్ పెంపు, అప్పులు తగ్గింపు ! అంబానీ మాస్టర్ ప్లాన్జియో టవర్స్ పెంపు, అప్పులు తగ్గింపు ! అంబానీ మాస్టర్ ప్లాన్

బీఎస్ఈలో యస్ బ్యాంకు స్టాక్స్ 12.74 శాతం తగ్గి రూ.11,750గా ఉంది. ఇదిలా ఉండగా, ఇండియా టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ లెండర్ జాబితాలో యస్ బ్యాంక్ స్థానం కోల్పోయింది. ప్రస్తుతం యస్ బ్యాంకు 11వ ర్యాంకులో ఉంది. పదో స్థానాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్రమించింది. యస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,476.23 కోట్లు కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ విలువ రూ.27,740.85 కోట్లు.

Yes Bank declines 12%: Drops out of Indias top 10 most valued lenders

మోస్ట్ వ్యాల్యూడ్ బ్యాంకుగా ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ మొదటి స్థానంలో ఉంది. దీని మార్కెట్ క్యాప్ విలువ రూ.6.61 ట్రిలియన్లు. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3.05 ట్రిలియన్లు, కొటక్ మహింద్రా బ్యాంకు రూ.2.84 ట్రిలియన్లు, ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్ రూ.2.69 ట్రిలియన్లు.. తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా యాక్సిస్ బ్యాంకు రూ.2.14 ట్రిలియన్లు, ఇండస్ ఇండ్ బ్యాంకు రూ.87540.37 కోట్లు, బందన్ బ్యాంక్ రూ.64808.74 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.40419.84 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.34092.97 మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి.

English summary

52 వారాల గరిష్టానికి యస్ బ్యాంక్ షేర్లు, ఇండియా టాప్ 10 లిస్ట్ నుంచి ఔట్! | Yes Bank declines 12%: Drops out of India's top 10 most valued lenders

Yes Bank Ltd has lost its place in the list of India's 10 most valued lenders, in terms of market capitalization, after brokerage firm UBS India cut its target price by over 47%.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X