For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్ సిరీస్ నష్టాలతో ప్రారంభం, సడన్ సెల్లింగ్‌తో వణికిన ట్రేడర్లు

By Chanakya
|

ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అనేట్టు ఉంది స్టాక్ మార్కెట్ తీరు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూన్ సిరీస్ ప్రారంభం రోజున తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్, నిఫ్టీలు ఎట్టకేలకు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం పన్నెండు వేల పాయింట్లపైన స్థిరంగా ప్రారంభమైన నిఫ్టీ.. పదకొండున్నర గంటల సమయంలో అనూహ్యమైన ఒత్తిడికి లోనైంది. ఒక దశలో బ్యాంక్ నిఫ్టీ 1200 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీలో కూడా 200 పాయింట్లకు పైగా పతనం నమోదైంది.

ఏం జరుగుతోందో తెలిసే లోపే మార్కెట్లు కుదుటపడ్డాయి. మిడ్ సెషన్ తర్వాత కూడా నిస్తేజం అలానే కొనసాగింది. చివరకు సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 39 వేల 715 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11923 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 31375 వద్ద క్లోజైంది.

ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, రియాల్టీ రంగ కౌంటర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది.

Sensex ends 117 points lower, Nifty holds 11,900

టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఐటీసీ, గ్రాసిం, మహీంద్రా అండ్ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్మెంట్ లూజర్స్ జాబితాలో చేరాయి.

ఎందుకు సడన్ సెల్లింగ్
మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో నిఫ్టీ 12027 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ.. ఉన్నట్టుండి నిఫ్టీ ఏకంగా 188 పాయింట్లు నష్టపోయి 11839కి పడిపోయింది. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే మళ్లీ ఆరు నిమిషాల్లో నిఫ్టీ 70 పాయింట్లకు పైగా రికవర్ అయింది. ఎవరో హెచ్ ఎన్ ఐ.. ప్రోగ్రామ్ బేస్డ్ సెల్లింగ్‌ చేసి ఉంటారని, అందుకే ఈ తరహా సెల్లింగ్‌ వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

జూన్ సిరీస్ నష్టాలతో ప్రారంభం, సడన్ సెల్లింగ్‌తో వణికిన ట్రేడర్లు | Sensex ends 117 points lower, Nifty holds 11,900

The market close the volatile day on the negative side but off day's low after cabinet announcement under Modi 2.0.
Story first published: Friday, May 31, 2019, 18:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X