For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షణాల్లో బంగారం కొనొచ్చు.. ఎలాగో తెలుసా?

By Jai
|

బంగారం కొనాలనుకొంటున్నారా ? నగల దుకాణానికి వెళ్లే సమయంగానీ, ఓపికగానీ లేదా? మీరేం బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలాంటి వారికోసమే డిజిటల్ వాలెట్ సంస్థలు డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చాయి. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఎలాగూ ఉంటుంది కాబట్టి క్షణాల్లో బంగారాన్ని కొనవచ్చు. పేటీయం, మోబిక్విక్, ఫోన్ పే, గూగుల్ పే వంటి మొబైల్ యాప్ లతో పాటు సేఫ్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ వంటి సంస్థల ద్వారా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చు. మీకు ఎంత అవసరం ఉంటె అంత బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది.

PPF డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ ఎలా పొందాలి?PPF డిపాజిట్స్‌పై ఎక్కువ వడ్డీ ఎలా పొందాలి?

డిజిటల్ గోల్డ్ కొనుగోలు

డిజిటల్ గోల్డ్ కొనుగోలు

24 క్యారెట్ల 99.99 స్వచ్చతతో కూడిన ఈ బంగారాన్ని లైవ్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని మీ ఖాతాలోనే దాచుకోవచ్చు లేదా మీ ఇంటికి డెలివరీ కూడా తీసుకోవచ్చు. అవసరమయితే ధర ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవచ్చు కూడా. ఒకవేళ మీ వద్ద జమయిన బంగారాన్ని విక్రయిస్తే ఆ సొమ్ము మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. లేదా మీకు నచ్చిన వారికీ బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. కొన్నియాప్ లు సేవింగ్ పథకాలు సైతం అందిస్తున్నాయి. మీవద్ద డబ్బు ఉన్నప్పుడు ఎంతో కొంత దీని కోసం వినియోగించవచ్చు.

ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పై పెద్దగా అవగాహన లేనివాళ్లు చాలా మంది డిజిటల్ రూపంలో ఉన్న బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

డిజిటల్ గోల్డ్‌కు పెద్దపీట

డిజిటల్ గోల్డ్‌కు పెద్దపీట

ముఖ్యంగా యువత డిజిటల్ గోల్డ్ కు పెద్దపీట వేస్తోంది. అందుకే ఈ బంగారం అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. 2012-13 సంవత్సరం లోనే బంగారం డిజిటల్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఎనిమిది కోట్లకుపైగా ఖాతాలు ప్రారంభమయ్యాయంటే వీటికి ఉన్న ఆధరణ ఏంటో తెలుస్తోంది. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ లావాదేవీలు రోజుకు తొమ్మిది కిలోలవరకు జరుగుతున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. వార్షికంగా తొమ్మిది టన్నుల బంగారం అమ్మకాలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం అంటే భారతీయులకు మక్కువ. పసిడి ఆభరణాలను ధరించడం మన సంస్కృతి. తమ వద్ద మిగులు సొమ్ము ఉంటె చాలు ఎంతో కొంత బంగారం కొనేస్తారు చాలామంది. అందుకే మన దేశం లో ఏటా 750-850 టన్నుల వరకు డిమాండ్ ఉంటోంది.

పొదుపు, పెట్టుబడి తీరు మారింది

పొదుపు, పెట్టుబడి తీరు మారింది

నాటి కా లం నుంచే పెద్దలు తమ శక్తి మేరకు బంగారం కొనుగోలు చేస్తూ వచ్చేవారు. ఇలా కొనే మొత్తం పెళ్లి చేసే సమయంలో ఆడపడుచులకు ఉపయోగ పడేది. ఇది కొంతమందికి పొదుపు అలవాటును నేర్పింది. ఇప్పుడు కాలం మారింది. పొదుపు, పెట్టుబడి తీరు మారింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ గోల్డ్ ఆవిర్భవించింది. ఇలాంటి సులభమైన అవకాశాన్ని మీరు కూడా వదులుకోవద్దు. గోల్డ్ లో పెట్టుబడి పెట్టె నిర్ణయాన్ని తీసుకోండి. గోల్డ్ లక్...

Read more about: gold sale బంగారం
English summary

క్షణాల్లో బంగారం కొనొచ్చు.. ఎలాగో తెలుసా? | At the moment there are many options to buy gold digitally: Many companies offered on the mobile wallet platform.

At the moment there are many options to buy gold digitally: Many companies offered on the mobile wallet platform.
Story first published: Monday, May 13, 2019, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X