భారత్ వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధిస్తున్నాయని, ఇండియా టారిఫ్ కింగ్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ కూడా అదేవిధంగా మాట్లాడారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రేడ్ విండ్స్ ఫోరమ్ అండ్ ట్రేడ్ మిషన్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. అమెరికా కంపెనీలకు ప్రస్తుత వాణిజ్య అవరోధాలు తొలగించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. డేటా లోకలైజేషన్‌పై ఆంక్షలు కూడా తొలగించాలన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వ వీటిని పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నిబంధనలు తొలగేలా చూడటమే మా లక్ష్యం
వ్యాపార నిర్వహణ వ్యయం తగ్గించాలని, డేయా పరిమితులను ఎత్తివేయాలని విల్బర్ రాస్ అన్నారు. డేటా పరిమితులతో సహా అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలపై భారత్ విధిస్తున్న పరిమితులు, నిబంధనలు తొలగించేలా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. బైక్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఆల్కాహాల్, ఆటో మొబైల్స్ వంటి ఉత్పత్తులపై భారత్ ఎక్కువ టారిఫ్ వసూలు చేస్తోందన్నారు. ఇండియాలో అమెరికా కంపెనీలకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, టారిఫ్ విధించేవి, విధించనివి కూడా ఉన్నాయన్నారు. భారత్ వాణిజ్య విధానాలు, నియమ, నిబంధనలు విదేశీ కంపెనీలకు ప్రతికూలమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ సంకాలను విధిస్తోందని, సగటున 13.8 శాతం టారిఫ్ ఉందన్నారు. ఆటో మొబైల్స్ పైన అమెరికా 2.5 శాతం పన్ను విధిస్తే, ఇండియాలో 60శాతంగా ఉందని, బైక్స్, లిక్కర్, వ్యవసాయ ఉత్పత్తులపై వరుసగా 50 శాతం, 150 శాతం, 113 శాతం ఉన్నాయని, కొన్నింటిపై ఏకంగా 300 శాతం ఉందన్నారు.

కొత్త ప్రభుత్వంలో కొలిక్కి
ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిందని, దీనిని స్వాగతిస్తున్నామని, జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్నీ కొలిక్కి వస్తాయని భావిస్తున్నామన్నారు. అధిక టారిఫ్‌లు సరికాదన్నారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇంత గరిష్టంగా సుంకాలు లేవన్నారు. ట్రంప్ చెప్పినట్లుగా వాణిజ్య సంబంధాల్లో పారదర్శకత, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, కానీ భారత్‌లో ప్రస్తుతం అమెరికా కంపెనీలు అవరోధాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతులయ్యే పలు వస్తువులపై తాము సున్నా పన్ను కూడా విధిస్తున్నామన్నారు.

ఐటీ సర్వీసుల కారణంగా లోటు
గత ఏడాది భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 14,200 కోట్ల డాలర్లకు చేరుకుందని ఆయన తెలిపారు. 2007తో పోల్చితే ఇది 1,600 కోట్ల డాలర్లు పెరిగిందన్నారు. అయితే సర్వీస్ సెక్టారులో మాత్రం లోటు ఉందని, గత ఏడాది ఇది 300 కోట్ల డాలర్లుగా ఉందని చెప్పారు. చాలా దేశాల్లో మిగులు ఉన్నప్పటికీ భారత్ విషయంలో మాత్రం ఐటీ సర్వీసుల కారణంగానే లోటు ఉందని చెప్పారు. కాగా, ట్రంప్ చెప్పినట్లుగా భారత్ పన్నుల రాజు ఏమీ కాదని, వ్యవసాయం వంటి రంగాల ప్రయోజనాలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటోందని భారత నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు.. అమెరికా వీసా రూల్స్‌లో ఈ తేడా ఎందుకు?

రష్యా చమురు కొనాలని ప్రపంచ దేశాలను ట్రంప్ అడుక్కుంటున్నారు.. అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్..

హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్.. వెంటనే సైనిక చర్యలు ఆపాలని డిమాండ్..

కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఖండించిన భారత్.. ఆప్ఘన్లకు మద్ధతు ప్రకటన..

విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్! ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications