మార్చి 2019 ఆర్థిక సంవత్సరం వరకు ఇన్‌కం ట్యాక్స్ కంప్లియన్స్ నోట్ల రద్దు కంటే ముందుకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత అంటే నాలుగేళ్లలో ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. నోట్ల రద్దు వల్ల ట్యాక్స్ బేస్ పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇన్‌కం ట్యాక్స్ కంప్లియన్స్ పడిపోతున్నాయి. ఐటీ డిపార్టుమెంట్ డేటా ప్రకారం... 2017-18లో ఇన్‌కం ట్యాక్స్ పేయర్స్ కంప్లియన్స్ లెవల్ 91.6 శాతంగా ఉండగా, 2018-19 ఏడాదిలో 79.1 శాతానికి తగ్గింది. అంటే 13.7 శాతం తగ్గింది.

ఐటీ రిటర్న్స్‌కు టైముంది కానీ
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై చివరి వరకు సమయం ఉంది. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు, ప్రమాణ స్వీకారాల హడావుడి నేపథ్యంలో మరీ అంతగా పెరగకపోవచ్చునని భావిస్తున్నారు. కంప్లియన్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవచ్చునని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున మిడిల్ క్లాస్ ఓటర్లకు గాలం వేసేందుకు కఠినంగా ఉండదని భావిస్తున్నారు. 'సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కంప్లియన్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండదు. మిడిల్ క్లాస్ ఓటర్లు చాలా ముఖ్యం' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంత మిడిల్ క్లాస్ ఓటర్లు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వైపు చూస్తారు.

మొదటిసారి ఫైల్ చేసినవారు ఆపేశారేమో
మొదటిసారి ఫైల్ చేసినవారు, నోట్ల రద్దు అనంతరం ఆపివేసి ఉండవచ్చునని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అప్లియన్స్‌లో తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత కంప్లియన్స్ లెవల్ గ్రోత్ సింగిల్ డిపాజిట్‌గానే ఉంది. 2017-18లో 91.6గా ఉంది. అంతకుముందు, 2016-17లో 85.1 శాతంగా ఉంది. అంటే 7.7 శాతం పెరిగింది. 2016-17లో కంప్లియన్స్ గ్రోత్ లెవల్ 2.5 శాతంగా ఉంది. నోట్ల రద్దు తర్వాత సధారణంగా ఇది పెరగాలని, కానీ ఈ ఫలితాలు ఆశ్చర్యకరమని ఓ ట్యాక్స్ అనలిస్ట్ చెబుతున్నారు.

ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం
ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేసేవారి సంఖ్య తగ్గడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం. సంబంధిత డేటా ప్రకారం ఇప్పటి వరకు ఐటీ ఫైల్ చేసినవారు 66.8 లక్షలు. 2017-18లో ఫైల్ చేసిన వారి సంఖ్య 68.5 లక్షలు. అంటే అంతకుముందు ఏడాది కంటే ఈసారి ఫైల్ చేసినవారి సంఖ్య 1 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.
2014-15లో ఫైలింగ్స్ 34,173,994 మంది. టోటల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ 43,120,913. కంప్లియన్స్ 79.3 శాతం
2015-16లో ఫైలింగ్స్ 43,343,737 మంది. టోటల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ 52,223,836. కంప్లియన్స్ 83 శాతం
2016-17లో ఫైలింగ్స్ 52,868,037 మంది. టోటల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ 62,134,605. కంప్లియన్స్ 85.1 శాతం
2017-18లో ఫైలింగ్స్ 67,474,904 మంది. టోటల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ 73,634,944. కంప్లియన్స్ 91.6 శాతం
2018-19లో ఫైలింగ్స్ 66,809,129 మంది. టోటల్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ 84,514,539. కంప్లియన్స్ 79.1 శాతం
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications